అప్పుల్లో కూరుకుపోయిన అన్నపూర్ణ స్టూడియోస్… బయటపడేందుకు నాగార్జున ఏం చేస్తున్నాడో తెలుసా….??

అక్కినేని నాగార్జున కుటుంబం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని.. అక్కినేని నాగార్జున కుటుంబం ప్రస్తుతం ఇండస్ట్రీ ని ఏలుతున్నారు. అక్కినేని నాగార్జున అనే కాకుండా ఆయన కుమారులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కానీ నాగార్జున అంత పేరు ప్రఖ్యాతలు ఆయన కుమారులు పొందలేకపోయారు. నాగచైతన్య, అఖిల్ ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.

అంతేకాదు చాలా కష్టపడుతున్నారు కూడా. ఇదిలా ఉండగా అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియో అప్పుల్లో కూరుకు పోయిందట. ఈ విషయాన్ని స్వయంగా అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కొడుకు వెంకట్ తెలిపారు. అక్కినేని నాగార్జున సినిమా హీరో కావాలని.. తాను ఎంతగానో కోరుకున్నట్టు తెలిపారు వెంకట్. ఇక ఆ సమయంలో అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలన్నీ తానే చూసుకునేవాడని తెలిపాడు.

కొన్ని కారణాల వల్ల తాను అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాల నుంచి తప్పుకున్నాడని.. అనంతరం నాగార్జున ఆ బాధ్యతలని తీసుకున్నాడని వెల్లడించారు. అయితే… గతంలో అన్నపూర్ణ స్టూడియోస్ అప్పుల్లో కూరుకుపోయిందని.. వెంకట్ చెప్పుకొచ్చారు. కానీ ఆ విషయాన్ని బయట పెట్టకుండా.. సినిమాలు చేయడం ద్వారా వచ్చిన డబ్బులను అన్నపూర్ణ స్టూడియోస్ లో పెట్టి.. దానిని నాగార్జున కాపాడాడని వివరించాడు వెంకట్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.