తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్పనటులలో నటుడు చంద్రమోహన్ కూడా ఒకరు. ఈయన చేసిన సినిమాలు అప్పట్లో చాలా విజయాలను సైతం అందుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఆయన వరుస సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఎంతోమంది స్టార్ హీరోలు సైతం ఈయనకి మంచి స్నేహితులుగా ఉండేవారట. చంద్రమోహన్ తో సినిమాలు చేయడానికి చాలామంది హీరోయిన్స్ సైతం చాలా ఇంట్రెస్ట్ చూపించేవారట.
అయితే ఈయన ఒకసారి ఏదైనా సినిమాలో చేశారు అంటే ఆ హీరోయిన్ ఫేట్ ఒక్కసారిగా మారిపోతుంది.. అందువల్లే ఇయన పక్కన హీరోయిన్ చేయడానికి చాలా మంది పోటీపడేవారు .ఇలాంటి తరుణంలోనే అప్పుడప్పుడే హీరోగా ఎంట్రీ ఇస్తున్న యాక్షన్ కింగ్ మోహన్ బాబు చంద్ర మోహన్ కి మధ్య ఒక చిన్న గొడవ జరిగిందట.. అదేమిటంటే చంద్రమోహన్ చేయాల్సిన ఒక సినిమాని మోహన్ బాబు చేస్తున్న సమయంలో ఒక ఉద్దేశంతో మోహన్ బాబుని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారట చంద్రమోహన్.
ఈ విషయం అప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడంతో మోహన్ బాబు కూడా చంద్రమోహన్ మీద చాలా సీరియస్ అయ్యారట.అయితే ఆ తర్వాత వీళ్ళ మధ్య కొద్ది రోజులు గ్యాప్ వచ్చి మళ్ళీ ఇద్దరు కలిసి చాలా సినిమాలలో నటించారు. చంద్రమోహన్ గారికి కూడా కాస్త కోపం ఎక్కువగా ఉండడం వల్ల ఇతర హీరోలతో కూడా పలు రకాల చిన్న చిన్న గొడవలు ఉండేవట. ఇటీవల పలు అనారోగ్య సమస్యలతో చంద్రమోహన్ మరణ వార్త విని సినీ ప్రముఖులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.