” గుంటూరు కారం ” ధియేటర్ బిజినెస్ అన్ని కోట్లా.. మహేష్ హిట్ కొట్టకపోతే అంతే సంగతి..

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న మూవీ గుంటూరు కారం. మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న‌ ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి పెంచాయి. మహేష్ బాబు ఈ సినిమాలో ఎప్పుడు లేని విధంగా గుంటూరు కారం మాస్ యాంగిల్ లో కనిపించబోతున్నాడు. జనవరి 12న వరల్డ్ వైడ్గా థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పటికే థియేటర్ బిజినెస్ లు పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే లెవెల్ లో బిజినెస్ జ‌రిగింద‌ట‌.

దాదాపు రూ.135 కోట్ల రూపాయలకి థియేట్రిక‌ల్‌ బిజినెస్ జ‌రిగింద‌ట. ఇక శ్రీ లీల, మీనాక్షి చౌదరి కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శ‌ర వేగంగా జరుగుతుంది. మ్యూజికల్ సెన్సేషన్ థ‌మన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఇప్పటివరకు జరిగిన థియేటర్ బిజినెస్ లెక్క ప్రకారం రూ.136 కోట్ల షేర్ వస్తేనే గాని ఈ సినిమా ఏపీ, తెలంగాణలో హిట్గా నిలవదు. అంటే దాదాపు రూ.250 కోట్లకు పైగా షేర్ వ‌సూళ్లను కొల్లగొట్టాలి. సంక్రాంతి సీజన్ కావడంతో ఇప్పటికే ఈ సినిమాకు భారీ పోటీ ఏర్పడింది.

రవితేజ ఈగల్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, అలాగే హనుమాన్ మూవీ కూడా గుంటూరు కారం సినిమాతోపాటు సంక్రాంతి రేసులో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు కారంకు మొదటి షో తోనే హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర హిట్ అవుతుంది. లేదంటే ఈ సినిమాతో భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ – రాజమౌళి కాంబోలో పాన్ ఇండియా లెవెల్ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఒకవేళ గుంటూరు కారం సినిమా హిట్ అయితే నెక్స్ట్ రాబోయే కాంబోకి కూడా మంచి హైప్‌ నెలకొంటుంది. ఇక‌ మహేష్ ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో వేచి చూడాలి.