సత్యం రాజేష్ ప్రధానోపాత్రలో చేతబడుల కాన్సెప్ట్ తో సస్పెన్స్ త్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించిన చిత్రం మా ఊరి పొలిమేర.. ఈ సినిమా 2021లో డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా డైరెక్టర్గా ఓటీటి లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. చివరిలో ఈ సినిమా అదిరిపోయే ట్విస్ట్ పెట్టడంతో ఆడియన్స్ సైతం ఈ సినిమా సీక్వెల్ పైన చాలా హైప్ క్రియేట్ అయ్యేలా చేశారు. దీంతో ఈ సినిమా సీక్వెల్ పై అభిమానులు ఆడియన్స్ సైతం చాలా ఆతృతగా ఎదురు చూశారు.
అంతేకాకుండా ఈ సినిమాను థియేటర్లో విడుదల చేయడం జరిగింది. నవంబర్ 3వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే అదిరిపోయే టాక్ తో బయటికి రావడం జరిగింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. పొలిమేర -2.. ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి త్రిబుల్ బ్లాక్ బాస్టర్ దిశగా ముందుకు వెళ్తోంది.
ఈ సినిమా ఇప్పటివరకు వరకు 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ వారం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాల హవా ఏమీ లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా భారీగానే జోరు కొనసాగించేలా కనిపిస్తోంది. సత్యం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రాజేష్ ఈ సినిమాతో తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఇప్పుడు పొలిమేర చిత్రంతో ఇంతటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈయనకి మరింత క్రేజ్ పెరిగిపోయింది.ఈ చిత్రంలో అటు రాజేష్ తో పాటు కామాక్షి భాస్కర్ల ,బాలాదిత్య, గెటప్ శ్రీను తదితరులు సైతం నటించడం జరిగింది.