మంగళవారం గురించి తెలియని విషయాలు ఇవే..!!

పాయల్ రాజ్ పుత్ మెయిన్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం ఉన్నారు.RX 100 సినిమా తర్వాత వీరి కాంబినేషన్లు వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది.ఈ సినిమా నవంబర్ 17న విడుదల కాపాడుతోంది. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ని వేగవంతంగా చేస్తోంది.

తాజాగా డైరెక్టర్ అజయ్ భూపతి హైదరాబాదులో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు. మంగళవారం చిత్రాన్ని చూసి ప్రజలు తప్పకుండా షాక్ గురవుతారని గ్రామీణ నేపథ్యంలో సాగే మిస్టీరియస్ థ్రిల్లర్ సినిమా అని.. ఎక్కువ శాతం నైట్ సూట్ లోనే సినిమా షూటింగ్ చేశామని తెలిపారు. ఈ సినిమాలో మ్యూజిక్ కి ఎంత ప్రాధాన్యత ఉందో కూడా తెలియజేయడం జరిగింది…

ముఖ్యంగా ఈ చిత్రంలోని ఘన ఘన మోగాలి అనే పాటకి ప్రతి ఒక్కరికి కూడా పూనకాలు వస్తాయని మంగళవారం చిత్రాన్ని ఎలాంటి అంచనాలు అపోహాలు లేకుండా ఓపెన్ మైండ్ తో చూడాలని తెలియజేశారు అజయ్ భూపతి.. మొదటి భాగంలో వచ్చే ఎన్నో ప్రశ్నలకు సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలకు ప్రేక్షకులు చాలా షాక్కు గురవుతారని ముఖ్యంగా చివరి 45 నిమిషాలు ఈ సినిమా ట్విస్టులతో కూడి ఉంటుంది అంటే తెలిపారు. ప్రేక్షకులకు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఈ సినిమా ఏడాదిన్నర క్రితమే కథను అల్లు అర్జున్ విన్నారని.. అయితే అజయ్ ,బన్నీకి కథ ఎంతగానో నచ్చిందని ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.