బాలయ్య ” అన్ స్టాపబుల్ ” షోని రిజెక్ట్ చేసిన మెగా హీరో…. అస‌లు రీజ‌న్ ఇదే..!

బాలయ్య ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఓన్ టాలెంట్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒకపక్క పాలిటిక్స్ ని మేనేజ్ చేస్తూనే.. మరో పక్క సినిమా రంగంలో దూసుకుపోతున్నారు. అలాంటి బాలయ్యని హోస్ట్ గా చూసి ప్రేక్షకులు అందరూ షాక్ అయ్యారు. బాలయ్య ఏంటి? అసలు ఈయన హోస్ట్ గా సెట్ అవుతాడా? అని అనేక వార్తలు వచ్చినప్పటికీ… బాలయ్య ” అన్ స్టాపబుల్ ” షో హోస్టింగ్ చూశాక అందరి నోర్లు మూగబోయాయి.

అంతేకాదు ఈ షో కేవలం బాలయ్య హోస్టింగ్ చేయడం వల్లే ఈ రేంజ్ లో పాపులారిటీ వచ్చిందని వార్తలు సైతం వినిపించాయి. చేస్తే ఈ రేంజ్ ఫన్ తో హోస్టింగ్ చేయాలి అని అనిపించేలా చేశారు బాలయ్య. ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తి చేసుకుంది ఈ బిగ్గెస్ట్ షో. ఈ రెండు సీజన్స్ లో కూడా ఎంతోమంది టాప్ స్టార్ సెలబ్రిటీస్ తో బాలయ్య చేసిన సరదా అంతా ఇంతా కాదు. మూడవ సీజన్ ఇక ఉండదేమో అని చాలామంది ప్రేక్షకులు భయపడ్డారు.

కానీ రీసెంట్ గానే ఈ సీజన్ 3 కూడా ప్రారంభించారు. ఈ ఎపిసోడ్ ఆడిషన్లో మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ అతిథిగా విచ్చయబోతున్నాడు అని ఈ సీజన్ ప్రారంభం ముందు ఎన్నో వార్తలు వినిపించాయి. ఈ షో నిర్వాహకులు అల్లు అరవింద్ నిజంగానే చిరంజీవిని సంప్రదించాడట. అడిగిన వెంటనే డేట్స్ చూసుకుని ఇస్తాను అన్న చిరంజీవి.. ఇప్పుడు మాత్రం ఈ షోలో పాల్గొనడానికి పెద్ద గా ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

చిరంజీవి, బాలయ్య మధ్య చిన్న చిన్న మనస్ప‌ర్థ‌లు వచ్చిన విషయం నిజమే. కానీ అనేక సందర్భాలలో బాలయ్య బాబు కొన్ని విషయాలలో చిరంజీవిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఆ గ్యాప్ తొందర్లోనే పోతుందని.. ఇద్దరూ మంచి స్నేహితులు అయిపోతారని అందరూ అనుకున్నారు. కానీ అది నెరవేరలేదు. చిరంజీవి ఈ షో కి హాజరవ్వక పోవడానికి కూడా ఇదే కారణం అంటూ సోషల్ మీడియాలో ఓ పుకారు షికారు చేస్తుంది.