నాగార్జున నటించిన గీతాంజలి మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా… చూస్తే అవాక్ అవ్వాల్సిందే…!!

నాగార్జున కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ సినిమాలలో ” గీతాంజలి ” ఒకటి. ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో నాగార్జున హీరోగా గిరిజ హీరోయిన్గా నటించారు. గిరిజ నటనకు ఎంతోమంది ఫిదా అయ్యారు. ఈ ముద్దుగుమ్మ పుట్టింది, పెరిగింది ఇంగ్లాండులో. గిరిజకు చిన్ననాటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టమట.

ఈ క్రమంలోనే చదువును మధ్యలో ఆపేయడం ఎందుకని చదువు పూర్తి చేసి.. భరతనాట్యం నేర్చుకోవడానికి ఇండియాకి వచ్చిందట. అనుకోకుండా అక్కడే గిరిజకి మణిరత్నం పరిచయం అయ్యాడట. ఇక వెంటనే మణిరత్నం గిరిజను చూసిన మరుక్షణం సినిమాలలో నటిస్తావా అని అడిగారట. ఇక గిరిజకి కూడా సినిమాలు, డ్యాన్స్ లు అంటే ఆసక్తి ఉండడంతో ఓకే చెప్పిందట. అలా గిరిజ మొదట గీతాంజలి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

అనంతరం రెండు, మూడు సినిమాలలో కూడా నటించింది. ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ గిరిజకి మాత్రం పెద్దగా పేరు ప్రఖ్యాతలు రాలేదు. ఇందుమూలంగానే స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళ్ సినిమాలలో కూడా మంచి అవకాశాలను అందుకుంది. గిరిజ తండ్రి డాక్టర్ కాగా తల్లి ప్రముఖ వ్యాపారవేత్త. సినిమాలలో రాణించలేనని అనుకున్న గిరిజ తిరిగి ఇంగ్లాండ్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం గిరిజ ఇంగ్లాండ్లో జర్నలిస్టుగా పనిచేస్తుంది.