తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చి ఇప్పటికీ 21 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.. ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ప్రభాస్ 2002 నవంబర్ 11న ఈ సినిమా విడుదలై ఒక ట్రెండు ని సెట్ చేయడం జరిగింది. ఇందులో ప్రభాస్ మాస్ లుక్ లో కనిపించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికి 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి డైరెక్టర్ జయంత్ పరాంజి దర్శకత్వం వహించారు.
కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్స్ ని అందుకుంది. ఇందులో ప్రభాస్ కు జోడిగా శ్రీదేవి విజయ్ కుమార్ నటించింది. హీరోగా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాతో నిరాశనపరిచారు.. ఆ తర్వాత డైరెక్టర్ శోభన్ దర్శకత్వంలో వచ్చిన వర్షం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఏకంగా ఈ సినిమా 21 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవడం జరిగింది.
ఇక రాజమౌళి తెరకెక్కించిన చత్రపతి, బాహుబలి సినిమాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సలార్ ,కల్కి వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాపై అభిమానులు భారీగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ దాదాపుగా ఒక చిత్రానికి 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి 21ఏళ్లు పూర్తి చేసుకోవడంతో పలువురు అభిమానులు సైతం ప్రభాస్ కి సంబంధించి కొన్ని వైరల్ గా చేస్తున్నారు.
21 Years of Dominance in the Film Industry 👑
Celebrating Rebel Star #Prabhas‘ indelible mark of Charisma and Excellence 🌟#21YearsOfRebelstarPrabhas pic.twitter.com/QnLc3HBpKY
— UV Creations (@UV_Creations) November 11, 2023