” అమర్ కి ఇచ్చిన ఫోటోలో 16 హింట్లు ఇవిగోండి చూసుకోండి “… అంటూ తేజు ఫైర్…!!

బిగ్ బాస్ హౌస్ లోకి తేజు వెళ్లడంతో అమర్ కి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అయింది. అమర్ బలం ఏంటి? అతని బలహీనత ఏంటి? అనే విషయాలను తెలిపి హెచ్చరించింది. అంతేకాదు.. అమర్ ఆట గురించి చెప్పడమే కాకుండా కొన్ని హింట్లు సైతం ఇచ్చింది. అయితే హౌస్ నుంచి వెళ్తూ వెళ్తూ.. అమర్ కి ఓ ఫోటో ఫ్రేమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫోటో ఫ్రేమ్ లో16 హింట్స్ ఉన్నాయంటూ ట్రోల్ చేయడంతో దీనిపై రియాక్ట్ అయింది తేజు.

అయితే హౌస్ లోకి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా.. ఇన్ డైరెక్ట్ గా హింట్స్ ఇస్తున్నారనేది ఎప్పుడు ఉండే ముచ్చటే. అయితే ఈసారి హౌస్ లోకి వచ్చేవాళ్లు.. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కంటే కూడా చాలా సేఫ్ గా గేమ్ ఆడారు. ఎక్కడ నోరు జారకుండా.. ఎవరిని హట్ చేయకుండా చాలా సేఫ్ గా వెళ్లి వచ్చేసారు. అయితే అమర్ కి ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ లోనే గేమ్ కి సంబంధించిన హింట్స్ ఇచ్చిందంటూ.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.

తన ఇన్స్టా స్టోరీలో.. అమర్ కి ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ పిక్ ని షేర్ చేసి…” అందరూ తెగ ఫీల్ అయిపోతున్నారు. నేనేదో హింట్స్ ఇచ్చాన‌ని. చూసుకోండి దీంట్లో ఏం హింట్స్ ఉన్నాయి. అపార్థం చేసుకునే ముందు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడండి బ్రో ” అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. అమర్ బిగ్ బాస్ హౌస్ లో చేసిన 16 మిస్టేక్స్ ఆ ఫోటో ఫ్రేమ్లో ఉందనే విమర్శకు కౌంటర్ ఇచ్చింది తేజు. మీరు ఏదో ఊహించుకుని.. అనవసరమైన రాద్ధాంతం సృష్టించకండి అంటూ కోరింది. ప్రస్తుతం తేజస్విని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.