ఆర్టిస్టులంటే కృష్ణకు ఎందుకంత అభిమానం?… ఆ ఒకే ఒక్క ఘటన చూస్తే తెలుస్తుంది…!!

సూపర్ స్టార్ కృష్ణ మనందరికీ సుపరిచితమే. తన అద్భుతమైన నటనతో, డైలాగులతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకున్నారు. ఈయన మొదటిగా నటించిన మూవీ ” పండంటి కాపురం “. ఈ సినిమా రిలీజ్ అనంతరం.. కుటుంబ కథతో ఎంతోమంది అభిమానులని ఆకట్టుకుంది. ఈ కథపై నమ్మకంతో సూపర్ స్టార్ కృష్ణ నే రంగంలోకి దిగి సొంతంగా నిర్మించారట. ఇక జయప్రద పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకి.. నిర్మాతగా హనుమంతరావు, దర్శకుడిగా లక్ష్మి దీపక్ కవి వ్యవహరించారు. ఈ సినిమాలోని ఒక పాటని శివాజీ గార్డెన్స్ లో ఏర్పాటు చేశారట. కానీ రంగారావు గారు అక్కడికి రాలేదట.

తాగేసి ఇంట్లోనే ఉండిపోయారట. అప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి ఆయన కోసం వెళ్లి.. షూటింగ్ దగ్గరికి ఆయనని తీసుకు వద్దామనుకున్నారట. కానీ రంగారావు గారు మాత్రం ఏవో సాకులు చెప్పి ఆరోజు షూటింగ్ కి రాలేదట. ఈ క్రమంలోనే ప్రభాకర్ రెడ్డికి కోపం వచ్చి ఆయనని ఏదో ఒకటి అన‌డం మొదలుపెట్టారు. చంపేస్తాను ఏమనుకున్నావో అని అన్నారు. రంగారావు గారికి ఇంకా కోపం వచ్చి గట్టిగ గట్టిగ అరిచారట. అప్పుడు ప్రభాకర్ రెడ్డి కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పారు. ఈ గొడవ చూసిన గుమ్మడి వెంటనే కృష్ణ దగ్గరికి వెళ్లి…” రంగారావు తప్ప మరో ఆర్టిస్ట్ లేడా…? తాగుబోతు అనే కారణం వల్లే హరినాథ్ ని సినిమా ఇండస్ట్రీ పక్కన పెట్టేసింది కదా..? ” అని అన్నాడు.

అప్పుడు కృష్ణ ఆయని బ్రతిమలాడైన సరే తీసుకురావాలి అని అన్నారు. అప్పుడు మేకప్ మ్యాన్ వెళ్లి రంగారావు గారికి ఏమని చెప్పాడంటే…” కృష్ణ గారు నీపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో తెలుసా ” అని చెప్పడంతో… అప్పుడు కృష్ణ ఒక నిర్ణయం తీసుకున్నారు. సినిమా పూర్తయ్యే వరకు మద్యం తాగకూడదని శపథం చేశారు. ఇలా ఓ ఆర్టిస్ట్ ని సినిమా నుంచి తీసేయాల్సి వచ్చిన కృష్ణ గారు అలా చేయకుండా.. మంచి మనసుతో ఆయనని ఖండించారని మాధవ రావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.