మలయాళం నటుడు జయరాం కుమారుడైన కుర్ర హీరో కాళిదాసు జయరాం ఇటీవల తన బ్యాచులర్ లైఫ్ కు సైతం త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నారు. త్వరలోనే తన ప్రియురాలతో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. తన స్నేహితురాలు తరణి కళింగరాయర్ ను కాళిదాసు వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరికి సంబంధించి ఎంగేజ్మెంట్ చెన్నైలో చాలా గ్రాండ్గా జరిగినట్లు తెలుస్తోంది. ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో స్నేహితుల సమక్షంలో మీరు ఎంగేజ్మెంట్ జరిగినట్లు కనిపిస్తోంది.
జయరాం కు సంబంధించి ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సైతం కాళిదాస్ , తరణి తరఫున సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మలయాళం లో పాటు తమిళ సినిమాలలో నటించిన కాళిదాసు.. కమలహాసన్ నటించిన విక్రమ్ సినిమాలో తన తనయుడు ప్రభంజనం పాత్రను పోషించడం జరిగింది. ప్రస్తుతం ఇండియన్-2, ధనుష్ 50వ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
కాళిదాసు కు కాబోయే వధువు తరణి మోడల్ గా మొదట అలాగే మిస్ ఇండియన్ 2021 పోటీలలో ఈమె మూడవ స్థానంలో నిలవడం విశేషం. కాళిదాస్ తండ్రి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే అలా వైకుంఠపురంలో, ధమాకా , రాధే శ్యామ్ , ఖుషి తదితర సినిమాలలో నటించారు. ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించారు. ప్రస్తుతం వీరికి సంబంధించి పలు రకాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏదేమైనా ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు సైతం వివాహ బంధంతో ఒక్కటవుతుంది అభిమానులను మెప్పిస్తూ ఉన్నారు.