గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్ ” రాఘవేంద్ర ” సినిమా హీరోయిన్… ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!!

శ్వేత అగర్వాల్ అంటే చాలామందికి పెద్దగా గుర్తుకు రాకపోవచ్చు. కానీ అల్లరి సినిమాలో అప్పు అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అప్పు పాత్రలో ఈ ముద్దుగుమ్మ చాలా అద్భుతంగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. అల్లరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

అనంతరం ప్రభాస్ హీరోగా నటించిన ” రాఘవేంద్ర ” సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఎంతో లక్షణంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ తర్వాత తెలుగులో వరుసగా కొన్ని సినిమాలలో నటించింది. ఈ బ్యూటీ చివరగా ” షాపిత్ ” అనే సినిమాలో నటించింది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ శ్వేతాకు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు.

ఇక శ్వేత ఇండస్ట్రీకి 13 ఏళ్లు పాటు దూరంగా ఉన్నారు. అనంతరం 2020లో సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ ను వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప కూడా జన్మించింది. పెళ్లి అనంతరం తన పూర్తి లైఫ్ను కుటుంబంతో లీడ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బొద్దుగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక ఈ అమ్మడుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.