తండ్రి సీనియర్ ఎన్టీఆర్ తో.. బాలకృష్ణ నటించిన సినిమాలు ఇవే…!!

బాలయ్య ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది అభిమానులని దక్కించుకున్నాడు. ఎప్పుడు స్టార్ హీరోలతో పోటీ పడుతూ ఉంటాడు బాలయ్య. ఇక బాలయ్య అనే బిరుదు రాకముందు.. బాలయ్య నాన్నగారైన సీనియర్ ఎన్టీఆర్ సినిమాలలో నటించేవారు. వీళ్ళ కాంబో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. పూర్తిగా హీరోగా పేరు తెచ్చుకునే దాకా ఎన్టీఆర్ దర్శకత్వంలోనే సినిమాలు చేశాడు బాలయ్య. మరి ఎన్టీఆర్, బాలయ్య కాంబోలో వచ్చిన ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

1. దానవీరశూరకర్ణ:


దానవీరశూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్ బాలయ్య కలిసి నటించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

2. తాతమ్మ కల:


ఈ సినిమా ద్వారానే బాలయ్య తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అంతేకాదు ఈయన నటనకు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు.

3. అక్బర్ సలీం అనార్కలి:


ఈ సినిమాకి సీనియర్ ఎన్టీఆర్ గారు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సైతం సూపర్ డూపర్ హిట్ అయింది.

4. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం:


ఈ సినిమాకి కూడా బాలయ్య తండ్రి ఎన్టీఆర్ గారే దర్శకత్వం వహించారు. అంతేకాదు మంచి పేరుని కూడా బాలయ్య కి ఇచ్చారు.

5. బ్రహ్మశ్రీ విశ్వామిత్ర:


ఈ సినిమాకి ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా బాలయ్యకి పేరు కూడా బాగా వచ్చింది.

ఇలా బాలయ్య ఎన్టీఆర్ సినిమాల్లో నటించి మంచి హిట్లను ఖాతాలో వేసుకున్నారు. వీరి కాంబో కూడా చూడముచ్చటగా ఉంటుంది.