నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. కోట్లాదిమంది కాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు అన్ని దాదాపు హిట్స్ గానిలిచాయి. ఇక డి గ్లామరస్ రోల్స్ లో నటిస్తూ కట్టుబొట్టుతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తనవైపు తిప్పుకుంది. కథాపరంగా కంటెంట్ ఉండి ఆమెకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తుంది. కథలో ఏమాత్రం తన క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ లేదనిపించిన ఆ సినిమాలకు నో చెప్పేసేది. డేట్స్ అడ్జస్ట్ అవ్వక కూడా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసింది. అలా సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటి..? ఆ సినిమాల్లో ఆమె ఎందుకు..? రిజెక్ట్ చేసిందో తెలుసుకుందాం.
భోళా శంకర్ :
చిరంజీవి భోళా శంకర్‌లో కీర్తి సురేష్ రోల్ సాయి పల్లవి నటించాల్సింది. డేట్స్ అడ్జస్ట్ అవన్నీ కారణంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
చంద్రముఖి 2 :
రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో చంద్రముఖిగా సాయి పల్లవి నటించాలి కాని క్యారెక్టర్ లెంత్ తక్కువ ఉందనే కారణంతో ఆమె ఈ సినిమాలో రిజెక్ట్ చేసింది. అయితే తర్వాత కంగనా ఈ సినిమాలో నటించింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది.
డియర్ కామ్రేడ్ :
విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రష్మిక పాత్రలో సాయి పల్లవి నటించాలి. కానీ ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని.. కిస్ సీన్స్ ప్రతిసారి రిపీట్ అవుతున్నాయని భావించిన సాయి పల్లవి సినిమాను రిజెక్ట్ చేసింది. ఈ సినిమా మిడిల్ రేంజ్ హిట్ అందుకుంది.
లియో :
విజయ దళపతి హీరోగా.. త్రిష హీరోయిన్ గా నటించిన లియో సినిమాల్లో త్రిష పాత్రలో సాయి పల్లవి నటించాలి కాని డేట్స్ అడ్జస్ట్ అవన్నీ కారణంతో లియో సినిమాను ఆమె రిజెక్ట్ చేసింది. కాగా సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
సరిలేరు నీకెవ్వరు :
మహేష్ బాబు – రష్మిక హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కూడా మొదటగా సాయిపల్లవినే హీరోయిన్ అనుకున్నారట. అయితే ఆమె క్యారెక్టర్ లెంత్ తక్కువ ఉంది, క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ లేదు అని అభిప్రాయంతో ఆ సినిమాను కూడా రిజెక్ట్ చేసింది. ఈ మూవీ మిడిల్ రేంజ్ రిజల్ట్ తెచ్చుకుంది.
ఇలా సాయి పల్లవి ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసింది కాగా ఆమె రిజెక్ట్ చేసిన సినిమాలు దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాపులుగా నిలిచాయి. ఎక్కడో కొన్ని సినిమాలు మాత్రమే యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.