ఇండస్ట్రీలోకి రాకముందు నటుడు రక్షిత్ శెట్టి ఏం చేసేవారో తెలుసా..?

కన్నడ లో స్టార్ హీరోగా పేరుపొందిన నటుడు రక్షిత్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా రష్మికతో ప్రేమమనం నడిపి వివాహం వరకు వెళ్లి ఆ తర్వాత వివాహాన్ని రద్దు చేసుకోవడంతో మరింత పాపులారిటీ అందుకున్నారు. రక్షిత్ శెట్టి నటించిన అతడే శ్రీమన్నారాయణ, చార్లీ -777, సప్త సాగరాలు వంటి సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. హ్యాండ్సమ్ హీరోగా పేరు పొందిన రక్షిత్ శెట్టి మాస్ డైలాగులు హీరో ఇజానికి సైతం ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

నటుడు గానే కాకుండా డైరెక్టర్గా నిర్మాతగా కూడా రక్షిత్ శెట్టి తన సంస్థ ద్వారా కొన్ని మంచి చిత్రాలను తెరకెక్కించారు. కన్నడ నాట రక్షిత్ శెట్టికి మంచి డిమాండ్ ఉంది ఒక్క సినిమాకి కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్న రక్షిత శెట్టి ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు.. ఎంత జీతం తీసుకునే వారు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. రక్షిత్ ఇండస్ట్రీలోకి రాకుండా ఒక ఐటీ కంపెనీలో పనిచేసేవారు.. మొదటి జీతం 12 వేల రూపాయలు అందుకున్నారట.

తన తండ్రి నిర్మాతగా ఉన్నప్పుడు అతి చిన్న వయసులోని ఆరు నడపడం నేర్చుకున్న రక్షిత్ రెడ్డి తన తండ్రి పనిచేసే ప్రతి చోటకి కూడా సిమెంట్ బస్తాలను తీసుకువెళ్లే వారట.. అలా నమ్ ఎరియల్ ఒండ్ దిన అనే చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించారు.ఆ తర్వాత హీరోగా తుగ్లక్ అనే సినిమాలో నటించగా ఫ్లాప్ అయ్యింది. సింపుల్ ఆగ్వన్ లవ్ స్టోరీ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రక్షిత్ శెట్టి ఆ తర్వాత భారీ విజయాలను అందుకున్నారు. ఇది వలె సప్త సాగరాలు అనే సినిమాతో మరొకసారి విజయాలను అందుకుంటున్నారు.