కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆర్ఎక్స్ 100 బ్యూటీ.. ఏం జరిగిందంటే..?

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో అందంతో పాటు తమ అభినయంతోను ఆకట్టుకునే హీరోయిన్స్‌లో పాయ‌ల్ రాజ్‌పుత్‌ ఒకటి. సాధారణంగా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్స్ నెగిటీవ్‌రోల్లో నటించాలంటే చాలా భయపడుతూ ఉంటారు. కష్టమని ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆడియన్స్ లో ఎంట్రీనే నెగటివ్ రోల్ తో వెళ్తే.. ఆ నెగటివ్ ఇమేజ్ పడిపోతుంది.. అదే మైండ్ సెట్ తో ఆమెను ఏ సినిమాలో అయినా చూస్తారు.. అని అభ‌ద్ర‌తాభావం ఉంటుంది. కానీ పాయల్ రాజ్‌పుత్‌ మాత్రం మొదటి సినిమానే ఆర్ఎక్స్ 100 లాంటి నెగటివ్ రోల్ లో అదరగొట్టింది.

ఈ సినిమా తర్వాత అందరూ హీరోయిన్స్ అనుకున్నట్లుగానే పాయల్ రాజ్‌పుత్ మీద ఆడియన్స్ లో నెగిటివ్ మార్క్ పడిపోయింది. ఆ సినిమా తర్వాత ఆమెకి ఎక్కువగా నెగిటివ్ పాత్రలే వచ్చాయి. ఇప్పుడు ఆమె రీసెంట్గా తన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతితోనే మరోసారి మంగళవారం అనే సినిమాలో నటిస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఆడియన్స్ లో మంచి హైప్‌ నెలకొంది. ఇక పాయల్ రాజ్ పుత్ కెరీర్ లో మరో అద్భుతమైన రోల్ దొరికింది అంటూ ట్రైలర్ ని చూసిన ప్రతి ఒక్కరూ భావించారు.

ఇక త్వరలోనే రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్లో భాగంగా పాయల్ సందడి చేసింది. ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాన్ని వివరించింది. నాకు మంచి నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉంది.. ఆ కారణంగా నేను డిహైడ్రేట్ అయిపోయాను.. నాకు కిడ్నీ సమస్యలు తలెత్తాయి.. చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.. అంటూ వివరించింది. ఆమె మాట్లాడుతూ మీరు నాలా చేయకండి. శరీరానికి సరిపడా మంచినీటిని ఎప్పుడూ అందిస్తూ ఉండండి. తరచుగా మంచినీరు త్రాగుతూ ఉండండి.

శరీరాన్ని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి అంటూ వివరించింది. అలాగే ఆమె తన తొలిప్రేమ గురించి చెప్పుకొచ్చింది. చదువుకునే రోజుల్లో నాకు లవ్‌స్టోరి ఉందని ఒక అబ్బాయిని చూసి పిచ్చిపిచ్చిగా ప్రేమించాన‌ని.. అత‌ని చూస్తే నాకు మనసంతా ఆనందంతో నిండిపోయేదని.. ఇక ఎలాగైనా ప్రేమని చెప్పేద్దామని ధైర్యం చేసుకుని అతనికి ప్రపోజ్ చేశానని.. అయితే అతను రిజెక్ట్ చేయడంతో నేను డిప్రెషన్ లోకి వెళ్ళాను అని.. చదువు మీద కూడా శ్రద్ధ చూపించలేకపోయానని వివరించింది. ప్రతిరోజు ఈ విషయం నేను త‌లుచుకుంటూ ఏడ్చేదాన‌ని వివ‌రించింది. కాగా పాయల్ తన అనారోగ్య సమస్య గురించి చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.