బిగ్బాస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి హౌస్ లో ఎలాంటి సిచువేషన్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇన్నాళ్లు ఒకరంటే ఒకరు కొట్టుకొని చచ్చిపోయి బూతులు తిట్టుకున్న జనాలు ఫైనల్లీ ఇంట్లోకి వాళ్ళ కుటుంబ సభ్యులు రాగానే ప్రేమలో వలకబోసేస్తున్నారు. చాలామంది ఇదే తంతును ఫాలో అవుతున్నారు . తాజాగా బిగ్ బాస్ లో ఫ్యామిలీ వీక్ రన్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. పలువురు కంటెస్టెంట్ లకి సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్ లోకి ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చారు . కాగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ కొడుకు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
శివాజీ కొడుకు ఫ్యామిలీ వీక్ సందర్భంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తండ్రిని చూసి ఎమోషనల్ అయ్యాడు. హగ్ చేసుకుని నాన్న అంటూ ప్రేమగా పిలిచాడు. దీనికి సంబంధించిన విజువల్స్ వైరల్ అయ్యాయి . కాగా తన తండ్రికి ఎంతో సపోర్ట్ చేస్తున్న ప్రశాంత్ నీల్ కు కృతజ్ఞతలు తెలిపాడు . అంతేకాదు అనంతరం సోఫాలో కూర్చొని చాలా సరదాగా మాట్లాడుకున్నారు . ఇదే క్రమంలో నాన్నకు పలు సజెషన్స్ ఇచ్చాడు . ఎవరు రెచ్చగొట్టిన టెంప్ట్ అవ్వద్దు ఫైనల్ వీక్స్ లో మరింత స్ట్రాంగ్ గా ఉండు అంటూ సజెషన్స్ చేశారు.
ఈ క్రమంలోని కి కెన్ని చేతిని శివాజీ వేలితో గోకాడు ..కెన్ని తండ్రి తొడ పై చేయి వేసి ఏదో కోడ్ లాంగ్వేజ్ లో హింట్ ఇచ్చాడు . దీనికి సంబంధించిన విజువల్స్ ను బిగ్ బాస్ జూమ్ చేసి క్యాప్చర్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. శివాజీ కి కెన్ని కోడ్ లాంగ్వేజ్ తో ఏదో మాట్లాడుకున్నారు అని .. బహుశా విన్నర్ ఎవరు ..? బయట టాక్ ఏంటి..? అని లీక్ చేసి ఉండొచ్చని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది . అంతేకాదు కెన్ని.. బిగ్ బాస్ రూల్స్ ని బ్రేక్ చేశాడు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు జనాలు . అందుతున్న సమాచారం ప్రకారం శివాజీ – ప్రశాంత్ నీల్ మధ్య టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. మూడు నాలుగు ఐదు స్థానాలలో అమర్ – ప్రియాంక – గౌతమ్ లు నిలవబోతున్నారు అంటూ సర్వేలు చెబుతున్నాయి . చూద్దాం ఏం జరుగుతుందో..?