కూతురి పెళ్లి కోసం రాధా ఏం చేస్తుందో చూశారా… ఈ వయసులోనూ తగ్గేదేలే…!!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 1980 కాలం తరువాత మళ్లీ సినిమాలలో ఈమె కనిపించలేదు. అనంతరం ఈమె వారసత్వాన్ని కార్తీక్ నాయక్, తులసి నాయక్ తీసుకున్నారు. కానీ వీరిద్దరూ కూడా రాధాల ఇండస్ట్రీలో ఎక్కువ కాలం హీరోయిన్స్ గా ఉండలేకపోయారు. 10 సినిమాలు కూడా చేయకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటూ.. బిజీ అయిపోయారు.

కార్తీక ప్రస్తుతం దుబాయ్ లోని తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ను చూసుకుంటున్నారు. ఇక ఇప్పుడు పెళ్లి జీవితాన్ని మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ఒక పిక్ ని షేర్ చేసి తన ఎంగేజ్మెంట్ అని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అనంతరం ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను రాధా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ అబ్బాయి ఎవరు? పెళ్లి ఎప్పుడు? అనే విషయాలని మాత్రం తెలియజేయలేదు. ప్రస్తుతం వీరి ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నట్లు సమాచారం.

అయితే రీసెంట్ గా రాధా టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రాఘవేందరావు ని కలిశారు. ఈ క్రమంలోనే ఈమె ఓ వీడియో షేర్ చేసింది..” అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు. ఈ మీటింగ్ ఎన్నో కొత్త జ్ఞాపకాలని గుర్తుచేసింది ” అంటూ పేర్కొన్నారు. ఇక ఈ వీడియోకి రాఘవేంద్రరావు రెస్పాండ్ అవుతూ..” చాలా సంవత్సరాలు తరువాత కలిసినందుకు సంతోషంగా ఉంది. నీ కూతురు పెళ్లికి నా శుభాకాంక్షలు ” అంటూ రిప్లై ఇచ్చారు. ఈమె కూతురి పెళ్లి పిలుపులు భాగంగానే రాధా రాఘవేందర్రావుని కలిసినట్లు సమాచారం.ఈమె ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్ గా ఉండడం చూసి.. తగ్గేదేలే అంటున్నారు ప్రేక్షకులు. కూతురు పెళ్లి కోసం అనేక కష్టాలు పడుతుంది రాధా.