కమల్ కు హ్యాండ్ ఇచ్చిన నయన్… ఈ బ్యూటీలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా…!!

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” జవాన్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ సృష్టించింది. అయితే షారుఖ్ తో దోస్తీ చేస్తున్న నయనతార… కమల్ హాసన్ కు మాత్రం హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న ” థగ్ లైఫ్ ” హీరోయిన్ గా నయన్ ను నిర్ణయించారు.

కానీ రెమ్యునరేషన్ రూ.12 కోట్లు డిమాండ్ చేయడంతో పక్కన పెట్టేసి… ఈమె ప్లేస్ లో త్రిష కు ఛాన్స్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఇలాంటి ఇష్యూ ఇంతకుముందు కూడా వచ్చినట్లు సమాచారం. కార్తీ, తమన్నా ” పైయా ” సినిమా విషయంలోనూ ఇదే జరిగిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో మేకర్స్ తెలిపారు. నయనతారను సంప్రదిస్తే రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గకపోవడంతో.. తమన్నాకు ఛాన్స్ ఇచ్చినట్లు తెలిపారు.

ఇక ఈ సినిమా సక్సెస్ తో మిల్కీ బ్యూటీ తమన్నాకు వరుస ఆఫర్లు కూడా దక్కాయి. ఇక దళపతి విజయ్ ” విల్లు ” సినిమాలో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందంటూ మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.ఇక ఇలా ఒక్క సినిమానే కాకుండా అనేక సినిమాలలో.. రెమ్యునరేషన్ విషయంలో ఈ బ్యూటీ ఇలా చేయడం వల్ల.. ఈమెలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ బ్యూటీ ఇదే పంతంతో ఉంటే ఈమె కెరియర్ నాశనమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.