బేబీ నిర్మాతలో ఎవ్వరికీ తెలియని మరో యాంగిల్… మనోడి లో ఈ టాలెంట్ కూడా ఉందా…??

బేబీ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఈ సినిమా నిర్మాత ఎస్. కె.ఎన్ పెద్ద నిర్మాత అయిపోయాడు. ఈ క్రమంలోనే అనేక సినిమాలను సైతం నిర్మిస్తున్నాడు. అలాగే బేబీ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చెయ్యడం…. ఇది అధికారికంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఈయనకి మొదటి నుంచి మెగా అభిమానులు.

వీరిద్దరూ మెగాస్టార్ కి వీర అభిమానులు. అలాగే అల్లు అరవింద్ అంటే గురువుతో సమానంగా చూస్తాడు శ్రీనివాస్. ఈయన మొదట జర్నలిస్టుగా, తరువాత అల్లు అర్జున్ దగ్గర మేనేజర్ గా చేస్తూ.. గీత ఆర్ట్స్ లో పని చేసేవారు శ్రీనివాస్. అనంతరం చిన్నచిన్న సినిమాలు నిర్మించి.. బేబీతో హిట్ అందుకున్నారు. ఈయ‌నకి అల్లు అరవింద్ చాలా ప్రోత్సాహం ఇచ్చేవారట. తద్వారాన్ని ఈయన ఈ స్థాయిలో ఉన్నాడని సమాచారం. ఎస్ కె ఎన్ కి అల్లు అరవింద్ గారు వెన్నుముకల నిలబడ్డారు.

అందువలనే ఈయన సక్సెస్ అయ్యాడు. ఈయన ఇలా ఆర్థికంగా బలపడడంతో.. ఓ బెంజ్ కార్ ను సైతం కొన్నాడు. తాను కొన్న కారుని తన గురువు లాంటి అరవింద్ గారికి చూపించడానికి గీత ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర కి వెళ్ళాడు. అల్లు అరవింద్ గారు కూడా శ్రీనివాస్ ఈ విధంగా ఎదగడం చూసి చాలా సంతోషపడ్డారు. అంతేకాదు ఈయనని అభినందించారు కూడా. ఈ క్రమంలోని వీరిద్దరూ కొన్ని ఫోటోలు సైతం దిగారు.

ప్రస్తుతం వీరిద్దరూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎప్పుడు ముడీగా తన పని తాను చేసుకునే నిర్మాత… ఇలా తను కారు కొన్న విషయాన్ని తన గురువైన అల్లు అరవింద్ కి వెళ్లి చెప్పడం.. ఒక విధంగా మంచిదే అయిన.. మరొక విధంగా ఆయన ఎంత ఎదిగాడో అల్లు అరవింద్ కి చూపించడానికి అలా చేశాడు అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో మనోడి లో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ జనాలు.. ఆశ్చర్యపోతున్నారు