సినిమా హిట్ అవడం కోసం అమెరికాలో అలాంటి పని చేయబోతున్న కార్తీక్… ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు…!!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ” జపాన్ ” మూవీతో రికార్డులు బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దీపావళి కానుకగా రేపు ( నవంబర్ 10న ) రాబోతున్న ఈ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకునేందుకు రెడీ అయ్యాడు కార్తీక్. తెలుగు, తమిళ్ ప్రేక్షకుల అభిమానాన్ని తప్పకుండా పొందుతానని ధీమాతో ఉన్న కార్తీక్.. యూఎస్ఏ లో ను గట్టిగా ప్లాన్ చేశాడు.

ప్రైమ్ వీడియో ద్వారా అక్కడ ఈరోజు (ఈ నవంబర్ 9న) ఏకంగా 400 కు పైగా థియేటర్స్ లో విడుదల చేశారు. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనూ ఇమ్యాన్యుయల్ హీరోయిన్ గా నటించింది. ఇక 156 నిమిషాల రన్ టైం తో ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధమైంది. డ్రీమ్ వర్కింగ్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు జీవి ప్రకాశ్ సంగీతం అందించాడు.

ఈ సినిమాపై కార్తీక్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.తన సినిమాల రిలీజ్ విషయంలో ఎప్పుడు భయపడని కార్తీక్.. ఈ సినిమా విషయంలో మాత్రం కొంచెం భయపడుతున్నాడట. దానికి కారణం ఈ సినిమా ఆయన ఎంతో ఇష్టంగా ఎక్స్పెక్టేషన్స్ తో నటించడమే కారణమట. అంతేకాదు ఈ సినిమా హిట్ అవ్వాలని.. చెన్నైలో ప్రత్యేక పూజలు కూడా చేశారట. చూద్దాం మరి కార్తీక్ పూజలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో..??