నచ్చావులే సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించకుంది హీరోయిన్ మాధవి లత ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ తర్వాత నాచురల్ స్టార్ నానితో కలిసి స్నేహితుడా సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు పర్వాలేదనిపించుకున్న ఆ తర్వాత అడపా దడపా సినిమాలలో నటించిన పెద్దగా అవకాశాలు రాలేదు.. అయితే రాజకీయాలలోకి వెళ్లి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తూ పలువార్తలను వైరల్ గా చేస్తూ ఉంటుంది. గతంలో పెళ్లంటే ఇష్టం లేదన్న మాధవి లత ఇప్పుడు తాజాగా పెళ్లి పై ఆసక్తికరమైన విషయం తెలియజేస్తోంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవి లత కృష్ణుడిని బాగా ఆరాధిస్తూ ఉంటుంది. 2014 నుంచి కృష్ణుడు తన ఫ్రెండుగా మారిపోయారని అతనితో మాట్లాడుతూ ఉంటానని కృష్ణుడుతో కనెక్ట్ అయినవారికి ఆ ప్రేమ విలువ తెలుస్తుందని తెలిపింది మాధవి లత. 2023లో కృష్ణుడు వస్తాడని ఈ విషయం అందరికీ కామెడీగా అనిపించిన అప్పటినుంచి తనకు వివాహమంటే ఇంట్రెస్ట్ కలిగిందని చెప్పింది. అలా ఒకవేళ కృష్ణుడు వస్తే ఖచ్చితంగా ఈ ఏడాది వివాహం చేసుకుంటానని తెలుపుతోంది.
ఒకవేళ కృష్ణుడు రాకపోయినా అందుకు ఏదో ఒక రీజన్ కూడా ఉంటుందని తెలిపింది. గతంలో పెళ్లంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పినా మాధవి లత అలాంటిది కృష్ణుడు వస్తున్నాడు అనే విషయం తెలుసుకొని చాలా ఆనందంగా ఉండాలని తెలిపింది. తన పెళ్లితో పాటు సినిమాల గురించి తెలియజేసిన మాధవి లత తను ఇప్పటికీ కూడా నటనపరంగా సిద్ధంగానే ఉన్నానని హీరోయిన్ పాత్ర చేయాలని రూలేమీ లేదు గెస్ట్ రోల్ లోనైనా నటిస్తానని తెలియజేస్తోంది.