అవే నా జీవితాన్ని ఇబ్బందులు చేశాయి సమంత హాట్ కామెంట్స్…!!

గత రెండేళ్లుగా హీరోయిన్ సమంత ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఒకవైపు ప్రేమ పెళ్లి కూడా విఫలం కావడంతో చాలా మానసిక సంఘర్షణలకు గురైంది. మయోసైటిస్ తో ఇబ్బంది పడ్డ సమంత ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నది. మధ్య మధ్యలో సినిమాలు చేస్తూనే ట్రీట్మెంట్ తీసుకుంటోంది .ఇటీవలే ఖుషి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సమంత భూటాన్లో మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది.

తాజాగా ఇలాంటి సమయంలోనే సమంత ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడడం జరిగింది. తన జీవితంలో ఎదురైన కష్టాల గురించి తెలియజేసింది.. ముఖ్యంగా ప్రేమ పెళ్లి ఆరోగ్య సమస్యలు గురించి కూడా తెలిపింది.. అసలు విషయంలోకి వెళ్తే మీ జీవితంలో మంచి చెడుల గురించి మీ జీవిత ఆలోచనల గురించి ఏవైనా మాతో పంచుకుంటారా అని యాంకర్ అడగగా.. అందుకు సమంత నేను నటిగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాను కానీ ఆ సమయంలోనే తన వైవాహిక జీవితం ముగిసిపోయింది.. దీంతో ఆరోగ్యం కూడా దెబ్బతింది.. అది నా పని మీద చాలా ప్రభావాన్ని చూపించింది. దీంతో పాటు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. ఈ మూడు నా జీవితంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులని తెలిపింది సమంత.

గత రెండేళ్లుగా నేను భరించిన దానికంటే ప్రజలు చాలా దిగజారిపోయి మాట్లాడుకునే మాటలు చాలా బాధను కలిగిస్తాయి. ఎన్నో కష్టాలు నన్ను చుట్టుముట్టాయి ఒకవైపు హెల్త్ ప్రాబ్లమ్స్ తో పాటు ట్రోలింగ్ నెగిటివిటీ వార్తలు ఎక్కువగా వచ్చాయి.. వీటన్నిటిని ఎదుర్కొని తనను తాను బలంగా చేసుకున్నానని తెలిపింది. ఈ దేశంలో తనను అభిమానించే అభిమానులు ఉండడం నాకు అందిన ఒక అద్భుతమైన బహుమతి అని తెలిపింది. వాస్తవానికి నా కష్టమే నాకు బలం నా శక్తితోనే నేను పోరాడుతున్నానని తెలిపింది.