రజనీకాంత్ ఇటీవల నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రూ.700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి ప్రొడ్యూసర్‌కు భారీ లాభాలు తెచ్చి పెట్టిన ఈ సినిమాతో రజనీకాంత్ క్రేజ్మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నాడు రజిని. ఇక ప్రస్తుతం రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో రూపొందుతున్న లాల్ సలాం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత టీజే జ్ఞానవెల్ డైరెక్షన్లో మరో సినిమాలో నటించబోతున్నాడు తలైవార్.
వీరిద్దరి కాంబినేషన్లు రాబోతున్న ఈ సినిమా రజినీకాంత్ కెరీర్లో 170వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ 171 వ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన యాక్టర్స్ ఎవరు అనే విషయంపై ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. తాజాగా దానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తలైవార్ 171వ సినిమాలో రజనీకాంత్ విలన్ పాత్రలో ఆయన వీరాభిమానిని ఎంపిక చేసుకున్నారట.
ఈ సినిమాలో రజనీకాంత్ తో పోటీ పడటం కోసం లోకేష్.. నటుడు రాఘవ లారెన్స్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో లారెన్స్.. రజినీకాంత్ తో వార్కి రెడీ అవుతున్నాడు. ఇక ఈ అంశంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. తాజాగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రజనీకాంత్ కి వీరాభిమానే విలన్ అయ్యాడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోలు ఇద్దరు కాంబోలో సినిమా రావడం పై ఫ్యాన్స్ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.