గల్లీ పోరడు పై గలీజ్ మాటలు.. అక్క-చెల్లెలు రాహుల్ సింప్లగజ్ ని బకరా చేసేశారుగా..!!

రతిక ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించింది. ఈమె బిగ్ బాస్ షో కి వెళ్ళకముందు ఎవరో కూడా తెలియదు. బిగ్ బాస్ షో కి వెళ్లి పాపులారిటీ సంపాదించుకుంది. ఇది ఈమె గొప్పతనం కాదు.. రైతు బిడ్డ గొప్పతనం.. ఎందుకంటే రైతు బిడ్డని అడ్డం పెట్టుకుని పాపులారిటీ సంపాదించింది ఈ బ్యూటీ. అనంతరం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. కానీ ఈమెకి ఇంకో అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్.

కానీ దానిని ఈమె అస్సలు ఉపయోగించుకోవడం లేదు. ఈమె, రాహుల్ లవర్స్ అని తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయారు. ఈమె బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వీరి ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని రతిక‌ గానే అప్లోడ్ చేసి సింపతిని క్రియేట్ చేస్తుందంటూ రాహుల్ స్టోరీ సైతం పెట్టాడు. ప్రస్తుతం రతిక చెల్లి వీటిపై స్పందించింది. వీరి ఫోటోలు లీక్ అయిన విషయంపై ఈమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ” ఈ ఫోటోలను ర‌తిగానే లీక్ చేసిందని రాహుల్ గతంలో ఓ పోస్ట్ పెట్టాడు కదా.. మా అక్క హౌస్ లో ఉంది.. తన ఫోన్ నా దగ్గర ఉంది.. ఫోటోలు నేనయితే అప్లోడ్ చేయలేదు ” అంటూ చెప్పుకొచ్చింది.

ఈమె ఇంకా మాట్లాడుతూ… ” రాహులే కావాలని అప్లోడ్ చేసి తనని నెగిటివ్ చేస్తున్నాడు. అంతేకాదు రతికానీ పెళ్లి చేసుకోవడానికి రాహుల్ కండిషన్స్ కూడా పెట్టాడు. పెళ్లి చేసుకోవాలంటే.. నువ్వు ఇండస్ట్రీలో ఉండకూడదు. బయటకు వెళ్లడానికి వీల్లేదని చెప్పాడు.. ఇవన్నీ మా అక్క ఒప్పుకోకపోవడంతో తనతో బ్రేకప్ చేసుకున్నాడు. ఇప్పుడు అవే కక్షలు మనసులో పెట్టుకుని ఫోటోలు లీక్ చేసి మా అక్కని నెగిటివ్ చేస్తున్నాడు ” అంటూ పేర్కుంది. ఈమె వ్యాఖ్యలపై స్పందించిన ప్రేక్షకులు…” అక్క, చెల్లెలు రాహుల్ నీ బకరా చేస్తున్నారా… మీ అక్కే అనుకున్నాము నువ్వు కూడా ఇంతేనా.. ఛీ మీ బతుకులు…” అంటూ ఫైర్ అవుతున్నారు.