రానా హీరో కాకపోయి ఉంటే ఏ వృత్తిలో ఉండేవాడు తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో రానాకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రతి నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న రానా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా అవకాశాలను అందుకుంటూ ఫుల్ క్రేజ్ లో కొనసాగుతున్నాడు. ఇక చివ‌రిగా వెంకటేష్, రానా కాంబోలో వచ్చిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఓటీటీలో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దగ్గుబాటి సురేష్ బాబు సినీ వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన రానా.. లీడర్ సినిమాతో హీరోగా టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు.

ఈ మూవీలో తన నటనకు మంచి మార్కులు కొట్టేశాడు రానా. తర్వాత వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నడు రానా. ఈ ఇంట‌ర్వ్యూలో భాగంగా ఒకవేళ రానా సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్ లో కొనసాగే వాడు అనే ప్రశ్న రానాకు ఎదురైంది. రానా స్పందిస్తూ డెస్టినీ మనం ఏమి అవ్వాలో నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చాడు.

దీనిపై రానా మాట్లాడుతూ నాకు తెలిసి నా డెస్టిని ఈ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనే ఉందని. ఒకవేళ ఆర్టిస్ట్‌ కాకపోయినా ప్రొడ్యూసర్ గానో మరి ఇంకేదైనా ప్రొఫెషన్లో కచ్చితంగా సినీ ఇండస్ట్రీలోనే కొనసాగే వాడిని అంటూ రానా చెప్పుకొచ్చాడు. నాకు సినిమాలంటే ఇష్టం.. నా డెస్టినీ కూడా నాకు అదే ఛాయిస్ ని ఇచ్చింది అంటూ వివరించాడు.