జగన్ కి 90MM రాడ్ దించేయబోతున్న లోకేష్.. తెలివైనోడి దెబ్బ ఇలాగే ఉంటాది బాసూ..!!

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ” వ్యూహం ” సినిమా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. ఏపీ రాజకీయాలని ఉద్దేశించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాయి. ఇక రాంగోపాల్ వర్మ టిడిపిని, చంద్రబాబును కించపరిచేలా చిత్రీకరించినట్లు ఇప్పటికే టిడిపి నుంచి అభ్యంతరకర వ్యాఖ్యలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాని నవంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకి తేనున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. అయితే తాజాగా ఈ విడుదలను అడ్డుకోవాలంటూ టిడిపి ప్రధాన కార్యకర్త నారా లోకేష్ కోరారు.

ఇందులో భాగంగానే రిలీజ్ కు అనుమతి ఇవ్వకూడదని కోరుతూ సెన్సార్ బోర్డు కు లేఖ రాశారు లోకేష్. ఆరు పేజీలతో కూడిన లేఖలో పలు ఆసక్తికర విషయాలను ప్రకటించారు. ఈయన రాసిన లేక ఏంటంటే…” సీఎం జగన్ పదవీకాలం వచ్చే ఏడాది జూన్ తో ముగియనుందని.. ఈ నేపథ్యంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఓ టర్లను ప్రభావితం చేసే లక్షణాలతో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని చిత్రీకరించారని తెలిపారు. ఇక ఈ సినిమాలో మా నాయకుడు చంద్రబాబుతో పాటు మమ్మల్ని కూడా కించపరిచేలా సీన్లు ఉన్నాయని.. ఇవి పరువు నష్టం దావా కిందకు వస్తాయని ” లోకేష్ లేఖలో పేర్కొన్నారు. అలాగే ట్రైలర్ విడుదలైన సమయంలో లోకేష్ ఢిల్లీలో ఉన్నాడని.. అతని తండ్రి జైల్లో ఉన్నారని.. అందువల్లనే ట్రైలర్లో సదరు సన్నివేశాలు ఉన్నట్లు తమకు తెలియలేదని పేర్కొన్నారు.

వ్యూహం ట్రైలర్, దర్శకుడు, నిర్మాత మాట్లాడిన మాటల ఆధారంగా ఫిర్యాదు చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. తమ నాయకుడి ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల కి అనుమతి ఇవ్వకూడదని లోకేష్ చెప్పారు. అలాగే జగన్ తనను తాను హీరోగా చేసుకుని ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని లోకేష్ ఆరోపించారు. అందువలన ఈ సినిమా రిలీజ్ కు అనుమతి ఇవ్వకూడదు అంటూ లోకేష్ కోరారు. ఇన్నాళ్లు లోకేష్ ని అందరూ పప్పు అంటూ ఎందుకు పనికిరాడు అనుకున్నారు. కానీ.. రియల్ సింహం ఇప్పుడే నిద్ర లేచింది.

నోటికొచ్చినట్టు మాట్లాడి ఆడవాళ్ళని.. హర్ట్ చేయడం కాదు. ఎప్పుడు ఎలా ఎవరిని దెబ్బ కొట్టాలి.. అనేది లోకేష్ కి బాగా తెలుసు. అందుకే సరైన సమయంలో లోకేష్ ” వ్యూహం ” సినిమాని అడ్డుకోవడానికి లేక రాశారు. ఇది పరోక్షకంగా.. జగన్ కు 90mm రాడ్డు దింపేసినట్లే… ఎందుకంటే లోకేష్ ఇలా చేస్తాడని.. జగన్ కూడా అస్సలు ఊహించలేకపోయాడు. ఏది ఏమైనా సరే పులి కడుపున పులే పుడుతుంది అని.. చంద్రబాబు కడుపున అలానే పుట్టిందని టిడిపి శ్రేణులు, అభిమానులు ఓ రేంజ్ లో లోకేష్ ని పొగిడేస్తున్నారు.