ఐబొమ్మకు ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ” సిగ్గుంటే ఆ పని చేసి చూపించండి ” అంటూ ఫైర్…!!

సినిమా ఇండస్ట్రీకి పట్టిన దరిద్రాలలో మొదటిది పైరసీ. దీనివలన ఎంతోమంది నిర్మాతలు నష్టపోతున్నారు. స్టార్ సినిమాలు థియేటర్ లో సినిమా పడిన నెక్స్ట్ మినిట్.. పైరసీ సైట్స్ లో దర్శనమిస్తుంది. దీని కారణంగా డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు కోట్ల నష్టాన్నిచవిచూడాల్సి వస్తుంది. దీనిని అరికట్టడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఫలితం లేకుండా పోతుంది. ఒకప్పుడు తమిళ్ రాకర్స్ అనే వెబ్సైట్ ఉండేది. కానీ ఇప్పుడు ఐబొమ్మ ఆ స్థానాన్ని ఆక్రమించింది. దీంతో ఈ సైట్ కు ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనిని అరికట్టడానికి అనేక ప్రయత్నాలు సైతం చేశారు. అనంతరం ఐబొమ్మ మేకర్స్ సైతం సైట్ ని క్లోజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అభిమానుల కోరిక మేరకు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక కొంతకాలంకితం ఐబొమ్మ వాళ్లు సినీ ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ వార్నింగ్ ని నటుడు, డైరెక్టర్ అయిన రాజ్ మదిరాజు ఖండించాడు. రాజేంద్ర ప్రసాద్, గౌతమి జంటగా రాజ్ మదిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ ఒరిజినల్ సిరీస్… ఈటీవీ విన్ లో ప్రసారం అవుతుంది. దీనిని కూడా ఐబొమ్మ వాళ్లు తమ సైట్ లో అప్లోడ్ చేశారు. దీంతో డైరెక్టర్ రాజ్ మదిరాజు ఐబొమ్మ కి వార్నింగ్ ఇచ్చారు.ఆయన మాట్లాడుతూ..” అయ్యా ఐబొమ్మ.. కృష్ణారామా చిత్రంలో పెద్ద హీరోలు లేరు. రెమ్యునరేషన్ తీసుకున్న ఇద్దరు పెద్ద తారలు మధ్యతరగతి వాళ్లే. రోజుకూలీకి పనిచేసేవాళ్ళే.. చాలా ఎమ్మెన్సీలో ఎగ్జిక్యూటివ్స్ కన్నా వీళ్ళ సంపాదన తక్కువే… వాళ్ల సంపాదనకు సరిపోను టాక్సులు కట్టేవాళ్లే.. కానీ మాది ఒరిజినల్ కథ. ఎక్కడి నుంచి దొబ్బుకు రాలేదు. షూటింగ్ మొత్తం హైదరాబాద్లోనే తీశాం. సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చెయ్యలేదు.

డైరెక్ట్ ఓటీటీ లోనే రిలీజ్ చేసాము. మధ్యతరగతి వాడి కోసం 100 రూపాయలు కడితే ఫ్యామిలీ అందరూ కూర్చుని నెల అంతా సినిమాలు చూసే అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు చెప్పండి.. మీ సైట్ లో మా సినిమాని ఎందుకు రిలీజ్ చేశారు. నిజానికి సినిమా దర్శకుడిగా నా సినిమా ఎన్ని ఎక్కువ వెబ్సైట్ల‌లో కనిపించి ఎంత ఎక్కువ మంది సినిమా చూస్తే అంత మంచిది… అయినా సరే నేను దీన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే వాళ్లంతా ఈటీవీ విన్ సబ్ స్క్రైబ్ చేసుకుని చూస్తే నిర్మాతలకు పెట్టిన డబ్బు తిరిగి వస్తే.. ఇంకొన్ని మంచి సినిమాలు తీస్తారన్న స్వార్థం. మీరు మీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన సినిమాలలో సగానికి సగం చిన్న చితక సినిమాలే.

ఇదా మీరు గతంలో పేదవాడు డబ్బులు పెట్టి చూడలేడని మేము వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నామని చెప్పారు కదా. ఇది మీరు డబ్బు సంపాదించడానికి వాళ్ల గురించి కాదని నిరూపించారు. కానీ ఒక్క మాట చెబుతా బ్రో.. సలహా అనుకోండి లేదా వార్నింగ్ అనుకోండి. కానీ తీసుకోండి.. చేసి చెప్పండి. చిన్న పనే… ఒక్క సినిమా ప్రొడ్యూస్ చేయండి. అయితే.. పెయిన్ తెలియడానికి… అసలు పెద్ద సినిమాలకైనా సరే మీ లాజిక్ ఏ విధంగా తప్పు ఇంకో పోస్ట్ లో చెబుతా ” అంటూ ఫైర్ అయ్యాడు రాజ్ మదిరాజు. ప్రస్తుతం ఈయ‌న‌ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.