సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. యూట్యూబ్ పాపులారిటీ చెందాక .. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయాక.. మోసాలు అనేటివి ఎక్కువగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడానికి కొందరు స్టార్ సెలబ్రిటీల సహాయం తీసుకుంటున్న విషయం తెలిసిందే. పలువురు యూట్యూబర్లు సహాయం కూడా తీసుకుంటున్నారు. అయితే రీసెంట్ గా డాన్స్ మాస్టర్ శేఖర్ కూతురు సాహితీ పేరు చెప్పి అలాంటి మోసాలకి పాల్పడ్డారు .
దీంతో ఈ విషయం తెలుసుకున్న శేఖర్ మాస్టర్ వీడియో రిలీజ్ చేస్తూ జనాలను అప్రమత్తం చేశారు. శేఖర్ మాస్టర్ కూతురు సాహితి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది . ఈ క్రమంలోనే పలువురు ఆమె పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారట. మోసపోయిన వాళ్లు శేఖర్ మాస్టర్ దగ్గరకు వచ్చి లబోదిబో అనడంతో ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు . “నా కూతురు సాహితీ పేరు చెప్పి కొందరు మోసాలకు పాల్పడుతున్నారు .. దయచేసి వాళ్ళని నమ్మకండి .. నా కూతురుకి ఉండేది ఒకటే ఐడి .. ఐడిలో నేను ఫాలోవర్గా ఉన్నాను.. మిగతా ఏ ఐడీలు కూడా తనది కావు” అంటూ కొన్ని ఐడి లను షేర్ చేశారు .
దీంతో శేఖర్ మాస్టర్ వీడియో వైరల్ అవుతుంది. అయితే చాలామంది జనాలు శేఖర్ మాస్టర్ ఈ వీడియో రిలీజ్ చేయకముందు నిజంగానే శేఖర్ మాస్టర్ కూతురు డబ్బులుకి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసిందా ..? మమ్మల్ని చీట్ చేసిందా..? అంటూ షాక్ అయిపోయారట. ఫైనల్లీ నిజం తెలుసుకోవడంతో సాహితీ ని తప్పుగా అర్థం చేసుకున్నాము అంటూ బాధపడిపోతున్నారట..!!
View this post on Instagram