స్టార్ డైరెక్టర్ తో జతకట్టబోతున్న నాచురల్ స్టార్ నాని…!!

నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అలాగే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు ఈ హీరో నటించిన సినిమాల్లో ఫ్లాప్ అనేవి లేవు. ఇటీవలే ” దసరా ” సినిమాతో బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం శౌర్యవ్ దర్శకత్వంలో ” హాయ్ నాన్న ” మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే నాని.. బాలయ్య ,బాబీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో నటించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ” జెర్సీ ” సమయంలో ఈ హీరోకు కొంత అడ్వాన్స్ ఇచ్చిందట.

నాని ఇప్పటికీ ఆ మూవీ చేయలేదు. కాగా బాలకృష్ణతో కలిసి నటించే ఛాన్స్ ఇద్దామనుకుంటున్నారట. అలాగే డాన్ సినిమాను తెరకెక్కించిన సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని స్కందా నిర్మాత శ్రీనివాస్ చిట్లూరి నిర్మించబోతున్నాడట.