లియో మూవీ ఫస్ట్ రివ్యూ.. హిట్టా.. ఫట్టా..?

విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న లియో సినిమా ఫస్ట్ రివ్యూ ఎట్టకేలకు ఎదురవుతున్న అడ్డంకులను దాటుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 19న అనగా రేపు గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది. ప్రముఖ కోలీవుడ్ హీరో , రాజకీయనేత ఉదయనిది స్టాలిన్ ఈ సినిమాని చూసి సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఇకపోతే నిన్న మొన్నటి వరకు లియో సినిమాకు సంబంధించి అటు అభిమానులలో ఇటు ప్రేక్షకులలో నెలకొన్న సందేహాలకు సైతం ఆయన చెక్ పెట్టడం జరిగింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ సినిమా భాగమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా సూపర్ అని.. ఇందులో విజయ్ నటన, యాక్షన్ సీన్లు వేరే లెవెల్ లో ఉన్నాయని.. ఇక అన్బరీ యాక్షన్ కొరియోగ్రఫీ, అనిరుధ్ మ్యూజిక్ రెండూ కూడా సినిమాకు ప్లస్ గా నిలుస్తున్నాయని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇక ఈ సినిమాలో ట్విస్టులు కూడా వేరే లెవెల్ లో ఉన్నాయని ముఖ్యంగా సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది అంటూ సినిమాకు ఏర్పడిన అడ్డంకులను ఆయన తొలగించారు.

 

కొంతమంది కావాలనే సినిమాలను ఆపివేయాలని అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇలాంటి సమయంలో నేను సినిమా చూసి పూర్తిస్థాయిలో రివ్యూ ఇవ్వడం జరిగింది అంటూ ఆయన ట్వీట్ పెట్టి హాట్ టాపిక్ అయ్యారు. మొత్తానికి అయితే స్టార్ హీరో విజయ్ హీరో సినిమాకు ఎదురైన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. ఇక ఈ సినిమా వల్ల మాస్ మహారాజా టైగర్ నాగేశ్వరరావు నష్టపోయే అవకాశం ఉందనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉండగా.. మరి ఇందులో నిజా నిజాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా లియో సినిమాతో విజయ్ పక్క బ్లాక్ బాస్టర్ హిట్టు కొడతాడనే నమ్మకాన్ని కలిగించారు ఉదయనిధి స్టాలిన్.