” బిగ్ బాస్ 7 ” షోలో సందడి చేయనున్న ” భగవంత్ కేసరి ” టీం….!!

నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” భగవంత్ కేసరి “. ఈ సినిమాలో నేలకొండ భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ రోల్ లో బాలయ్య కనిపించనుండగా ఆయన కూతురిగా శ్రీ లీల నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మించారు.

ఇక ఈ సినిమాని అక్టోబర్ 19న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇక ఇప్పటికే మూవీ యొక్క ప్రమోషన్స్ పై గట్టిగా దృష్టి పెట్టారు మేకర్స్. ఇటీవల పలు మీడియా ఛానల్స్ కి సైతం ఇంటర్వ్యూ ఇచ్చారు టీం. అసలు మేటర్ ఏమిటంటే.. తాజాగా భగవంత్ కేసరి టీం తెలుగు టెలివిజన్ తెరపై ప్రచారం కానున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో సందడి చేయనున్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీ లీల ఇద్దరూ కూడా ఈరోజు బిగ్ బాస్ షోలో జాయిన్ అవ్వనున్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ తెలుగు 7 హోస్ట్ నాగార్జునని వారిద్దరూ కలిసిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.