భోలే శవాలి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మెంటలెక్కిపోద్ది… ఎందుకో తెలుసా…!!

ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ 7 టాప్ టిఆర్పి రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి మనకి తెలిసిందే. ముందు సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ కి రెండింతలు ఎక్కువ రేటింగ్స్ వచ్చాయి. అంతేకాకుండా స్టార్‌మా ఛానల్ని ఇండియాలోనే మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా నెంబర్ 1 స్థానంలో నిలిపింది. ఇదంతా పక్కన పెడితే గత వారం కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వారిలో భోలే శవాలి చాలా డిఫరెంట్ గా కనిపించాడు.

హడావిడిగా మాట్లాడటం, పనులు చేయడం, ఇతరల విషయంలో కలిగించుకోవడం, అలాంటివి ఎన్నో చేస్తున్నాడు. కొంతమంది ప్రేక్షకులు ఇతన్ని అతి పర్సన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎవరు ఈ భోలే శవాలి ? మ్యూజిక్ డైరెక్టర్గా ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలు ఏంటి ? అసలు ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. భోలే శవాలి తెలంగాణ ప్రాంతం లోని మహబూబాబాద్ జిల్లాకి సంబంధించిన పెనుకొండ అనే గ్రామానికి చెందిన వ్యక్తి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈయన.. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ముందు యూట్యూబ్లో పలు వీడియోలు ద్వారా బాగా పాపులర్ అయ్యాడు.

ఇలా పాపులర్ అయినా భోలే శవాలి, బాహుబలి సినిమాలోని ” పచ్చబొట్టేసిన ” పాటకి కీరవాణి సారథ్యం లో మ్యూజిక్ వాయించాడు. ఆ తర్వాత అనేక సినిమాలకు పాటలు పాడుతూ మ్యూజిక్ కంపోజ్ చేస్తూ వచ్చిన భోలే శవాలి రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్గా నిల్చిన ” మార్క్ అంటోని” సినిమాలోని పాటలు మొత్తానికి లిరిక్స్ అందించాడు. భోలే శవాలి ఎక్కువగా గాయకుడుగానే ప్రసిద్ధి చెందాడు. అలా ఆయన నమ్ముకున్న ఈ రంగం నుంచి ఎంతో కష్టం చేసి రూ.15 కోట్ల రూపాయల వరకు సంపాదించాడు. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా ఆయన మరింత పాపులారిటీని సంపాదించి ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటాడో లేదో చూడాలి మరి.