టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా పవన్ సినిమాలకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్న.. వరుసగా సినిమాల్లో నటిస్తూ జనాలను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన చాలా సినిమాలు హిట్స్ గా కూడా నిలిచాయి. ఇక తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాలనుకున్నాడట.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ సినిమా చేయకపోవడానికి కారణం ఏంటో సరిగా తెలియదు కానీ.. డైరెక్టర్ శంకర్ తీసిన సినిమాలలో రాజకీయానికి సంబంధించి ప్రత్యేకించి ఓ స్టోరీని ఇన్వాల్వ్ చేస్తు సినిమా తర్కెక్కిస్తాడు. అందువల్ల శంకర్ సినిమాలకు చాలా డిమాండ్ ఉంటుందిజ అలాంటి ఒక కథతోనే పవన్ కళ్యాణ్‌తో పొలిటికల్ డ్రామాగా నడిచే ఒక సినిమాను చేయాలనుకున్నాడట శంకర్. అయితే ఆ సినిమా ఏవో కారణాలతో మెటీరియలైజ్ కాలేదు.
దాంతో వీళ్ళిద్దరికి కాంబాలో సినిమా మిస్ అయింది. ఇక ఫ్యూచర్లో వస్తుందన్న క్లారిటీ లేదు. దానికి కారణం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం. ఇప్పటికే ఒప్పుకున్న చాలా సినిమాలను చేయడానికి తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్నాడు పవన్. ఒప్పుకున్న సినిమాలన్నీ చేసేటప్పటికి చాలా సమయం అవుతుంది. కనుక వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పట్లో అయితే సినిమా రావడం కష్టం. ఇక శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేజర్ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే శంకర్‌కు పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ వస్తుంది.