ఈ ప్రపంచానికి నీలాంటి మగాడు కావాలి.. బోల్డ్ బ్యూటీ అనసూయ‌ హాట్ కామెంట్స్..!!

రంగస్థలంలో రామ్ చరణ్, పుష్పలో అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది హాట్ యాంకర్ అనసూయ. ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉంది. ఇక అనసూయ సోషల్ మీడియాలోని అందాల ఆరబోత గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం మతిపోగొట్టే హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంటుంది.

ఇకపోతే నేడు (అక్టోబర్ 4) తన భర్త శుశాంక్ భరద్వార్ పుట్టినరోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేపించి.. చిరునవ్వులు చిందిస్తూ సోషల్ మీడియాలో… ప్రపంచానికి నీలాంటి కొడుకు కావాలి. నీలాంటి తమ్ముడు, నీలాంటి అల్లుడు, తండ్రి ఈ ప్రపంచానికి నీలాంటి మంచి మానవత్వం ఉన్న మనుషులు కావాలి.

నా విషయంలో అది నువ్వు. చాలా హ్యాపీగా ఉంది ధన్యవాదాలు శ్రీవారు అంటూ అనసూయ కామెంట్ బాక్స్ లో రాసుకొచ్చింది. అలాగే శుశాంక్ చేత కేక్ కట్ చేపించిన పిక్స్ సోషల్ మీడియాలో తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది. ప్రస్తుతం అనసూయ ఈమె భర్త దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.