మహేంద్ర గ్రూప్ చైర్మన్ అయిన ఆనంద్ గోపాల్ మహేంద్ర గురించి దాదాపు అందరికీ తెలిసిందే. సాధారణంగా ఈణ్ణి ఆనంద్ మహేంద్ర గా పిలుస్తారు. మహేంద్రా అండ్ మహేంద్రా సహ వ్యవస్థాపకుడు జగదీష్ చంద్ర మహేంద్రా వారసుడు అయినా ఆనంద్ మహేంద్రా.. నెట్ వర్త్ ఫోర్బ్స్ 2023 నివేదిక ప్రకారం రూ. 21 వేల కోట్లకుపైనే ఉన్నాయి. 2.6 బిలియన్ డాలర్ల నెట్వర్క్ కలిగిన ఆయన… సమకాలిన సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారనేది తెలిసిన విషయమే. సోషల్ మీడియా వేదికగా గొప్ప పనులను అభినందించడం, నూతన ఆలోచనలను ప్రోత్సహించడం ఈయన వ్యక్తిగతంలో ఒకటి.
ఇక ఈయన వ్యక్తిగత జీవితం విషయానికొస్తే… ఆయన సతీమణి అనురాధ ఒక జర్నలిస్ట్. వివాహానికి ముందే వెల్వెట్ అనే పత్రికను స్థాపించిన అనురాధ. ప్రస్తుతం వెర్వ్ తోపాటు మెన్స్ వరల్డ్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా చేస్తుంది. ఆనంద్ మహేంద్ర దంపతులకు ఇద్దరు కుమార్తెలు… ఇద్దరు అల్లుళ్లు విదేశీయులే కావడం ఆశ్చర్యం. పెద్ద కుమార్తె దివ్య డిజైన్, విజువల్ కమ్యూనికేషన్ లో 2009లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం వివిధ సంస్థలతో ఫ్రీలాన్సర్ గా, పార్ట్ టైం ఉద్యోగిగా పనిచేశారు. ఈ క్రమంలో 2016 ఫిబ్రవరిలో తన తల్లి ఎడిటర్ గా ఉన్న వెర్వ్ మ్యాగజైన్ లో ఆర్ట్ డైరెక్టర్గా చేశారు.
నాటి నుంచి నేటి వరకు ఆ పదవులోనే కొనసాగుతున్నారు.ఈమె న్యూయార్క్ లో మెక్సికన్ సమస్త కి చెందిన ఆర్కిటెక్ జార్జ్ జపాన్ వివాహం ఆడింది. ఇక రెండవ కుమార్తె ఆలికా కూడా పత్రికా రంగంలోనే కొనసాగుతున్నారు. ఇందులో భాగంగా ఈమె కూడా వెర్వ్ మ్యాగజైన్ లో పనిచేస్తున్నారు. ఈ మ్యాగజైన్ కు ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్నారు.ఈమె కూడా విదేశీయుడినే వివాహం చేసుకున్నారు. ఆనంద్ మహీంద్రా రెండవ కుమార్తె ఆలికా ఫ్రెంచ్ జాతీయుడిని వివాహం చేసుకుంది. ఇలా తండ్రి వ్యాపారాలతో సంబంధం లేకుండా… పూర్తిగా తల్లి ఎంచుకున్న రంగంలోనే ఇద్దరు కూతుర్లు కొనసాగడం ఆశ్చర్యం.