టాలీవుడ్లో ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో నటించి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి రాక్షసుడు మూవీ. ఈ సినిమా మొదటి తమిళంలో వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాని మొదట తెలుగులో నితిన్ తో రీమేక్ చేద్దామనుకున్నారట ఈ మూవీ ప్రొడ్యూసర్. కానీ అంతకుముందే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాను చేయాలని ఆ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి రీమేక్ రైట్స్ తీసుకోవాలని చూశాడు.
దానికి కొంతవరకు ఆ ప్రొడ్యూసర్ నిరాకరించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డాడీ బెల్లంకొండ సురేష్ ఈ టాపిక్‌లో ఇన్వల్వ్ అవ్వడంతో ఆ సినిమా రైట్స్ ని వాళ్ళు దక్కించుకోవడం జరిగింది. ఈ సినిమాకి రమేష్ వర్మ డైరెక్టర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతుంది. ఈ సినిమా చూసే ప్రేక్షకుల్లో మంచి ఎక్స్పీరియన్స్ పొందారు. నిజంగా ఈ సినిమాలో ప్రతీ సీన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ సినీ కెరీర్లో ద బెస్ట్ మూవీ గా ఈ సినిమాను కూడా చెప్పుకోవచ్చు.
ఇందులో అతడి నటనని కోట్లాదిమంది ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఈ సినిమానే బెల్లంకొండ శ్రీనివాస్ కు మొదటి కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన సినిమా. ఇక అనుపమ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రాజీవ్ కనకాల కీలకపాత్రలో నటించిన ఈ సినిమా టాలీవుడ్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమిళ్లో వచ్చిన ఈ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా తెలుగులో కూడా భారీ వశుళ్ళు రాబట్టింది. ఇక ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే చాలామంది ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తూ ఉంటారు.