స్కంద సినిమాలో రామ్ చెల్లెలు పాత్రలో నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..?

డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన మొదటి పాన్ ఇండియా చిత్రం స్కంద.. మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది రామ్ ద్విపాత్రాభినయంలో నటించారు. సాధారణంగా ఏదైనా కొత్త సినిమా విడుదల అయ్యిందంటే చాలు అందులోని నటీనటుల విషయాలు వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా స్కంద సినిమాలో నటించిన ఒక అమ్మాయి గురించి ప్రస్తుతం పలు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

స్కంద సినిమాలో సెకండాఫ్ లో రామ్ పోతినేని సిస్టర్ గా కాసేపు కనిపించిన ఈ అమ్మాయి చూడడానికి హీరోయిన్గా మెప్పిస్తున్నప్పటికీ ఈమె మొదటిసారి ఈ సినిమాలో కనిపించడంతో ఎవరాని పలువురు నెటిజన్లు ఆరా తీయడం జరిగింది. ఈమె సోషల్ మీడియా లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈమె భీమవరం ప్రాంతానికి చెందిన అమ్మాయి ఈమె పేరు అమృత చౌదరి ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమాలలో నటించాలని ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఇలా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

అమృత చౌదరి స్కంద సినిమాలో రామ్ సిస్టర్ గా నటించింది.. సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈమె ఎలాంటి దుస్తులలోనైనా సరే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. స్కంద సినిమా కంటే ముందు ఈమె కొన్ని పవర్ సాంగులలో కూడా షార్ట్ ఫిలిం లో కూడా నటించింది. ప్రస్తుతం ఈమె గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నేటిజెన్స్ ఈమె సోషల్ మీడియాని తెగ వెతికేస్తున్నారు. ప్రస్తుత ఈమెకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.