అతిపెద్ద బొమ్మల కొలువు ప్రారంభించిన సితార.. ఎక్కడంటే..?

ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ మాక్స్ ఫ్యాషన్ హాట్ ఆఫ్ హైదరాబాద్ గా విలిచ్చింది. కేపిహెచ్బి నెక్సస్ మాల్ లో 30-40 అడుగుల భారీ బొమ్మల కొలువును మొదలుపెట్టింది. దీంతో పాటుగా దసరా పండుగ సీజన్ కావడంతో బహుమతులు పంపిణీ కి కొన్ని అనాధ శరణాలయాలతో పాటు వృద్ధాశ్రమాలను కూడా భాగస్వాములను చేసింది.

ఇక ఇందులో బాగంగా నమ్రత శిరోద్కర్, సితార ఈ ప్రమోషన్స్ ను ప్రారంభిస్తూ 150 కి పైగా మ్యాక్స్ క్వీన్స్(బొమ్మ‌ల‌) తో కూడిన బొమ్మల కొలువును మొదలుపెట్టారు. ఈ క్రమంలో ల్యాండ్మార్క్ గ్రూప్ మాక్స్ ఫ్యాషన్ ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మార్కెటింగ్ హెడ్ పల్లవి పాండే మాట్లాడుతూ అతిపెద్ద బొమ్మల కొలువు, దసరా ఫెస్టివల్ ఆఫర్స్ ప్రారంభించడం ద్వారా మా కస్టమర్లకు షాపింగ్ సంతోషాన్ని అందించడమే మా ప్రయత్నం అంటూ వివ‌రించింది.

డైలీ వేర్ ఫ్యాషన్ కోసం, సాంప్రదాయం, లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులను అందించడం మా ల‌క్ష్యం అంటూ మెప్పింది. ఆమె మాట్లాడుతు హైదరాబాద్‌లో తమకు చాలా ప్రత్యేకమైన మ్యాక్స్ ఫ్యాషన్ రీజినల్ బిజినెస్ హెడ్ పెద్దిరాజు ఆనంద్ రామ్ ఇంది. ఇక తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలోని మాక్స్ అమ్మకాల్లో 64% ఈ నగరం నుంచే వస్తున్నాయని చెప్పుకొచ్చింది.