రజినీకాంత్ 170వ‌ సినిమా.. లేటెస్ట్‌ అప్డేట్స్ ఇవే..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అవందరికీ తెలిసిందే. రజనీకాంత్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన జైలర్ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, నాగబాబు, వినాయకన్ తదితరులు కీలక పాత్రలు వహించారు.

అయితే దీని అనంతరం రజినీకాంత్ చేయబోయే 170వ మూవీ డీటెయిల్స్ కోసం ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జై బీమ్ ఫేమ్ జ్ఞానవేల్ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ వారు గ్రాండ్గా నిర్మిస్తున్నారు. కాగా రేపటి నుంచి ఇందులోని కీలక నటులను ఒక్కొక్కరిగా మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది.

” తలైవార్ స్క్వాడ్ కోసం ఎదురు చూస్తూండండి.. టీమ్‌ అనౌన్స్మెంట్ రేపటి నుంచి మొదలు అంటూ లైకా ప్రొడక్షన్స్ వారు పెట్టిన పోస్ట్ ” ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుపాటి, మంజు వారియర్, రితిక సింగ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.