బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కంటిస్టెంట్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో దామిని కూడా ఒకరు. హౌస్ లో వంటలు అక్కగా పేరు సంపాదించిన దామని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది. తాను వెజిటేరియన్ కాకపోయినా గుడ్డు తింటానని బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన పాటను కూడా తానే పాడానని తెలియజేసింది. ఇప్పటివరకు తన శరీరం పైన పచ్చబొట్టు కూడా లేదని తెలిపింది.
తన జీవితంలో ఏదైనా స్పెషల్ మూమెంట్ ఉంటే తప్ప ఆ పని చేయనని తెలిపింది దామని. తనకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమని గత కొద్ది రోజులుగా డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటుందని తన ఒపీనియన్గా తెలిపింది. ఈ ముద్దుగుమ్మ సహజీవనం చేయడంలో కూడా ఎలాంటి తప్పేమీ లేదంటూ తెలిపింది. ఒకవేళ ఇలాంటి పని చేయవలసి వస్తే కుటుంబ సభ్యుల అనుమతి కచ్చితంగా తీసుకుంటానని తన తల్లితండ్రులు తనని అర్థం చేసుకోగలరని అందుకే ఇప్పటికి పెళ్లి చేసుకోలేదని దామని తెలియజేయడం జరిగింది.
దామిని ఇంట్లో చికెన్ తీసుకురారని బిగ్ బాస్ హౌస్ లో నేను చికెన్ కూర వండానని దాని మీద కూడా కామెంట్లు చేశారని తెలియజేసింది. బిగ్ బాస్ షోకు సంబంధించిన కొంత ప్రసారం చేయలేకపోవడం వల్ల తన మీద కాస్త వ్యతిరేకత వచ్చిందని తెలిపింది దామని. దానిని వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి.బిగ్ బాస్ హౌస్లో దామిని రియంట్రి ఇస్తారని వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.