ఉన్నపలంగా చెడు అలవాట్లు మానేసిన విశాల్.. ఎందుకో తెలుసా..?

పేరుకు తమిళ్ హీరో అయినా తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో విశాల్. రీసెంట్గా వచ్చిన ” మార్క్ ఆంటోనీ ” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన విశాల్… చాలా కాలం తర్వాత సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. తన వ్యక్తిగత విషయాలు బయట పెట్టాడు విశాల్. ” నాకు సిగరెట్ కాల్చే అలవాటు చాలా ఎక్కువ.

కాలేజీ సమయంలో, ఇండస్ట్రీలోకి వచ్చే మొదట్లో చైన్ స్మోకర్‌గా ఉండేవాడిని. చాలా ధూమపానానికి బానిస అయిపోయా. ప్రతిరోజు దాదాపు 25 సిగరెట్లు వరకు కాల్చేవాడిని. కానీ ఒక వ్యక్తికి ఉన్న చెడు అలవాట్లు కన్నా వారికి ఉన్న దృఢ సంకల్పం చాలా గొప్పదని ఆలోచించి ఉన్నపలంగా అలవాట్లు మార్చుకోవాలని నిర్ణయించుకున్న. అయితే లాస్ట్ సిగరెట్ ఫ్లష్ చేసి ఆ హ్యాబిట్ మానేసా” అంటూ విశాల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశాల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.