బిగ్ బాస్ 7 సీజన్లో 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. ఆమె పర్ఫార్మెన్స్.. ప్రేక్షకుల నుంచి మద్దతు సరిగ్గా లేకపోవడం హౌస్ నుంచి బయటకు పంపించడానికి కారణమైంది. మొదటి హౌస్ మేట్ గా సందీప్ బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాడు. రెండో పవర్ వస్త్రాను సాధించిన… మరో హౌస్ మేట్ గా శివాజీ కూడా కన్ఫామ్ అయ్యాడు. ఇక ఆదివారం రోజున ఎలిమినేషన్ ఉండనుంది. ఎవరు అనే విషయం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. బిగ్ బాస్ నుంచి షకీలా వెళ్లిపోనుందని తెలుస్తుంది.
మిగిలిన కంటెస్టెంట్లలో కొందరికంటే.. షకీలా బాగా ఇన్వాల్వ్ అవుతుంది. గేమ్ స్పిరిట్ చూపిస్తుంది. అందరితోనూ కలిసిపోయి ఉంటుంది. ఎవరికైనా గొడవలు వస్తే కలిపే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయాన్ని నాగార్జున కూడా ప్రస్తావించాడు. మంచి పని చేశావు షకీ అమ్మ అంటూ మెచ్చుకున్నాడు. కానీ ఎలిమినేషన్ లోకి వచ్చేసరికి పరిస్థితి వేరేలా ఉంది. బిగ్ బాస్ హౌస్ నుంచి రెండో వారం ఎలిమినేట్ అయ్యేది షకీలా అని తెలుస్తుంది. ఆమెకు ప్రేక్షకుల నుంచి మద్దతు తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు.. ఆమె గేమ్ లో ఇన్వాల్వ్ అవుతుంది కానీ… ఎంటర్టైన్మెంట్ మాత్రం సరిగ్గా ఇవ్వడం లేదని అనుకుంటున్నారు. షకీలా చాలా సాప్ట్ గా కనిపిస్తుంది.
చాలా విషయాలను మనసుకు తీసుకుంటుంది. హౌస్ లో అందరితో బాగానే ఉన్నా.. ఆటకు తగ్గట్టుగా లేదని అంటున్నారు. రెండో వారం నామినేషన్ జాబితాలో 9 మంది ఉన్నారు. పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శోభా శెట్టి, షకీలా, రతిక రోజ్, గౌతమ్ కృష్ణ, శివాజీ, అమర్ దీప్, ప్రిన్స్ యావర్ ఉన్నారు. అయితే ఇందులో శివాజీ పవర్ అస్త్ర సాధించి… ఎలిమినేషన్ నుంచి తప్పుకున్నాడు. ఇక మిగిలిన వారిలో షకీలాను ఎలిమినేట్ చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది.
నిజానికి ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం జరిగింది. షకీలా, శోభా శెట్టి ని బయటకు పంపించేద్దామని ప్లాన్ లో ఉన్నారని మాట్లాడుకున్నారు. కానీ షకీలా మాత్రమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్టుగా కనిపించింది. ఒకరిని ఎలిమినేట్ చేసి.. మరొకరిని సీక్రెట్ రూమ్ లోకి పంపి… బిగ్ బాస్ ఏదో చెప్పాలని ప్లాన్ చేసుకున్నాడట. ఏం చెప్తాడు ఈరోజు సాయంత్రం చూడాల్సి ఉంది.