స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎలాంటి స్కిన్ షో చేయకుండా కంటెంట్ ఉన్న పాత్రలు ఎంచుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది.
ఇకపోతే తాజాగా ” కుమారి శ్రీమతి ” అనీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నిత్యామీనన్ లీడ్ రోల్లో నటిస్తుండగా… ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ వీడియోను విడుదల చేసింది మూవీ యూనిట్. వాయిస్ ఓవర్ తో కూడిన ఈ క్లిప్పింగ్ లో …” అబ్దుల్ కలాం అట.. రజినీకాంత్ అట… తరువాత ఈవిడే నట.
ఉద్యోగం సద్యోగం చెయ్యదట.. బిజినెస్ చేస్తుందట.. కుటుంబాన్ని మొత్తం ఈవిడే లాకొస్తుందట. పెళ్లి గీల్లి వద్దంట. ఇలానే ఉండి పోదట ” అని బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే నిత్య పాత్ర ఈ సిరీస్ లో కుటుంబ బాధ్యత కలిగి ఉన్న మహిళగా కనిపించనున్నట్లు తెలుస్తుంది.
View this post on Instagram