ఈ 5 కారణాలవల్ల విడాకులు తీసుకుంటున్నారా.. అవేంటంటే..!!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నారు. వివాహ బంధాల్లో ఇబ్బందులు పడుతూ జీవించాల్సిన అవసరం లేదనుకుని విడాకులు కోరుకుంటున్నారు. సమాజం ఏం అనుకుంటుందో, నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచన లేకుండా తమ జీవితం కోసం ముందడుగు వేస్తున్నారు. ఈ కారణాలతో విడాకులు, కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో చాలా కాలంగా సమాజంలో చులకనగా ఉన్న విడాకులు అనే పదం నేడు సర్వసాధారణంగా మారింది.

చిన్న గొడవ వచ్చినా, మనస్పర్ధలైన కూర్చుని మాట్లాడుకోకుండా విడాకులు అనేదారిని ఎంచుకుంటున్నారు. ఎంత చదువు, సంస్కారం ఉన్నా ఒక విడాకుల విషయంలో మాత్రం అవన్నీ కోల్పోతున్నారు. ఇప్పుడు మగ, ఆడ అని తేడా లేకుండా సంతోషంగా లేని వివాహాల్లో జీవించడానికి ఇష్టపడడం లేదు. విడాకులు ఏ విషయల‌లో ఎక్కువగా తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

భార్య భర్త మధ్య ప్రేమ కోల్పోవడం:
సాధారణంగా భార్యాభర్త బంధంతో వచ్చే బాధ్యతల కారణంగా.. ఒకరికొకరు సమయం కేటాయించుకోకపోవచ్చు. ఇది తరువాత ఇద్దరు మధ్య దూరాన్ని పెంచుతుంది. ప్రేమ వివాహం చేసుకున్న వారిలో కూడా పెళ్లి తర్వాత ప్రేమ ముగుస్తుంది. ఇది కాకుండా బాగా స్వామిని తేలికగా తీసుకోవడం వంటివి పరస్పర ప్రేమ, గర్వం కోల్పోవడానికి ప్రధాన కారణాలుగా మారుతాయి.

అవసరాల్లో తోడు:
విజయవంతమైన వివాహా దాంపత్యనికి తోడు కీలకం. ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోకపోవడం. ఒకరు చేస్తున్న పనికి ఇంకొకరు సహాయంగా నిలబడకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పార్ధాలు వస్తాయి.

మరొకరితో సంబంధం:
శారీరక, మానసిక అవసరాలను తీర్చుకోవడానికి వారి జీవిత భాగస్వామికి తెలియకుండానే ఇతర వ్యక్తులతో సంబంధాలను పెంచుకుంటారు. ఈ విషయం కారణంగా చాలా జంటలు విడాకులు కోరుకుంటూ ఉంటారు.

జీవిత భాగస్వామిని గౌరవించడం లేదు:
వివాహం తర్వాత ఒకరితో జీవించడానికి.. కారణంగా వారిలో లోపాలు కనిపించవచ్చు. అవి అసలు నచ్చకపోవచ్చు. అయితే ఈ కారణంగా వాళ్లను ఎప్పుడూ చిన్న పెద్ద తేడా లేకుండా తిట్టడం. గౌరవించకపోవడం వల్ల ఆ మనిషికి విసుగు పుట్టి విడాకులు కోరుకోవచ్చు.

భాగస్వామిని అర్థం చేసుకోవడం:
వివాహ జీవితంతో ఎదురయ్యే చాలా కష్టాలకు భాగస్వామితో కలిసి పోరాడాలి. ఇద్దరూ కలిసి ఉండాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం, ప్రేమ, భాగస్వామ్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే భాగస్వామిని వేధింపులకు గురి చేయడం, గౌరవం ఇవ్వకపోవడం వంటి పనులు కూడా విడాకులకి దారితీస్తాయి.