డెబిట్ కార్డ్ లేకున్నా ATM లో డబ్బులు డ్రా చేయవచ్చు.. ఎలాగో తెలుసా (వీడియో)

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో డెవలప్ అయ్యింది. అందరూ చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఎంత పెద్ద పని అయినా చిటికెలో చేతిలో ఉండే మొబైల్ ఫోన్ తో కానిచేస్తున్నారు. పెద్ద పెద్ద లావాదేవీల నుంచి షాపింగ్‌ల‌ వరకు కూడా అందరూ ఫోన్లే ఉపయోగిస్తున్నారు. చేతిలో ఎవరు క్యాష్ మైంటైన్ చేయడం లేదు. కానీ, కొన్నిసార్లు లిక్విడ్ క్యాష్ కావాల్సి వస్తుంది.

అప్పుడు ఏటీఎం దగ్గరకు వెళ్లి తీసుకుందాం అనుకుంటారు. కానీ, డెబిట్ కార్డులు ఇంట్లో మర్చిపోయి ఉంటారు. మరి ఎలా? అని ఆలోచిస్తున్నారా… అంతగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయ్యింది కదా. డెబిట్ కార్డులతో ఏమాత్రం పని లేకుండా మీ చేతిలో ఉండే మొబైల్ తో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చట. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఆనంద్ మహీంద్రా.

” సెప్టెంబర్ 5న మొబైల్ లో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2023లో ఈ యుపిఐ, ఏటీఎం స్పష్టంగా ఆవిష్కరించబడింది. భారతదేశం ఆర్థిక సేవలను డిజిటలైజ్ చేస్తోంది. దీంతో పాటు కార్పొరేట్, సెంట్రిక్కి కాకుండా వాటిని యూజర్, సెంట్రిక్గా వేగంగా మార్చడం సులభం” అంటూ వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.