రూ.50 కోట్ల వ‌రుణ్ గాండీవ‌ధారి మూవీకి వ‌చ్చిన క‌ల‌క్ష‌న్ ఇదే..!!

మెగాస్టార్ సినీ బ్యాగ్రౌండ్ తో ఎంతో మంది స్టార్ హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వారిలో వరుణ్ తేజ్ కూడా ఒకడు. మెగా ప్రిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్ తనదైన స్టైల్ లో వైవిధ్య కథలను ఎంచుకుంటు సత్తా చాటాడు. లేటెస్ట్‌గా ప్రవీణ్ సత్తార్‌ డైరెక్షన్లో గాండీవ దారి అర్జున్ సినిమాలో వరుణ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగ‌స్ట్ 25న రిలీజ్ అయి ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే నెగిటివ్ టాక్‌ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ర‌న్ టైమ్ ముగిసింది. వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాగా ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది.

టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ మూవీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. గత సినిమా గనితో ఘోరంగా డిజాస్టర్ అందుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో నటించాడు. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. డిస్ట్రిబ్యూటర్లకు నిరాశ మిగిల్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 600 థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియ‌న్స్‌ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఓపెనింగ్స్ కూడా పెద్దగా రాలేదు.

వరుణ్ తేజ్ కెరీర్ లో భారీ బడ్జెట్లో నిర్మించిన మొదటి సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమా కూడా గాండీవధారి అర్జున్‌ సినిమానే. నైజం రూ.60 లక్షలు. సీడెడ్ రూ.15 లక్షలు, ఆంధ్రాలో రూ.65 లక్షలు వచ్చినట్లు సమాచారం. ఏపీ, తెలంగాణలో కలిపి రూ.1.40 కోట్ల గ్రస్స్ వసూలు రాగా రూ.75 లక్షల షేర్స్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1.51 కోట్ల షేర్ వచ్చింది. మొత్తంగా రూ.50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో రూ.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ తో బరిలోకి దిగి ఓవరాల్ గా రూ.1.50 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి తీవ్రమైన డిజాస్టర్ గా నిలిచింది.