ఈ సీజన్లో కచ్చితంగా తినాల్సిన‌ ఆకు ఇదే.. లేక‌పోతే అనారోగ్యం త‌ప్ప‌దు..!

వర్షాకాలంలో ఆకుకూరలను చాలా తక్కువగా తినమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఆకుకూరలకు వర్షాకాలంలో తగినంత సూర్యరశ్మి లేకపోవడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువగా చేరే అవకాశం ఉంది. అందుకే ఆకుకూరలను దూరం పెట్టమని నిపుణులు చెబుతుంటారు. ఆకుకూరలు తిన్న తినకపోయినా ఇప్పుడు చెప్పబోయే ఆకులు మాత్రం కచ్చితంగా ఈ సీజన్లో తీసుకోవాలి.

ఇంతకీ అది మరేదో కాదు చింతచిగురు. రుచికి పుల్లగా ఉండే చింత చిగురుతో చాలా రకాల కూరలు తయారు చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రాలో చింతచిగురు కూరలు చాలామందికి ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. చింతచిగురులో చాలా విలువైన పోషకాలు ఉంటాయి. అందువల్ల ఆరోగ్యపరంగా అపరమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

ఇదే సమయంలో అనేక వ్యాధులకు అడ్డుకట్ట వేస్తుంది. ప్రస్తుతం వర్షాకాలంలో రోగ నిరోధిక వ్యాధులను బలంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. అందుకు చింతచిగురు అద్భుతంగా సహాయపడుతుంది. వారంలో కనీసం రెండు సార్లు అయినా చింత చిగురును తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్టం స్ట్రాంగ్ గా మారుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.