ప్రముఖ అమెరికన్ టాప్ సింగర్, గేయ రచయిత జిమ్మీ బఫ్ఫెట్(76) గత శుక్రవారం రాత్రి నిద్రలోనే ఆయన మరణించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. జిమ్మీ మరణానికి గల కారణాలు ఇంకా బయటికి రాలేదు. శుక్రవారం రాత్రి తన కుటుంబం,స్నేహితులతో సరదాగా గడిపారు.. ఇక ఆయన చివరి శ్వాస వరకు ఆయన జీవితం ఓ పాటలాగానే ఎంతో ఆనందంగా సాగింది.
జిమ్మీ బఫ్ఫెట్ మరణం వార్త తెలీగానే పలువురు సెలబ్రిటీలు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపంం తెలిపారు. ఇక జిమ్మీ బఫ్ఫెట్ 1946 డిసెంబర్25న అమెరికాలోని మిసిసిపీలో జన్మించారు..తన 50 ఏళ్ల కెరీర్లో దాపు 27 స్టూడియో ఆల్బమ్‌లను విడుదల చేశాడు.. 1977లో విడుదలైన ‘మార్గరెట్ విల్లే’ ఆల్బమ్ ఆయన కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది.
ఇక జిమ్మీ బఫ్ఫెట్ గాయకుడిగా మాత్రమే కాకుండా మంచి రచయిత ఆయన రచించిన పుస్తకాలలో అత్యధికంగా అమ్ముడయిన పుస్తకాలు కూడా ఉన్నాయి. రెండు పిల్లల పుుస్తకాలు కూడా రచించాడు. ఆయనకు సొంతంగా మార్గరీటవిల్లే రికార్డ్స్ లేబుల్ కూడా ఉంది. అంతేకాకుండా పలు సినిమాలు, టీవీ షోలలో అతిథి పాత్రలో కనిపించారు.
1981లో మాజీ ఫ్లోరిడా గవర్నర్ రాన్ గ్రాహంతో కలిసి సేవ్ ది మనటీ క్లబ్‌నే స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించారు. గార్డియన్ ప్రకారం.. మిస్టర్ బఫెట్ 2016లో ఫోర్బ్స్ అమెరికా సంపన్నుల జాబితాలో550 మిలియన్ డాలర్ల నికర ఆస్తులతో 13వ స్థానంలో నిలిచారు. 2023లో బఫ్ఫెట్ నికర ఆస్తి విలువ 1 బిలియన్ డాలర్లు పేర్కొంది. జిమ్మీ బఫ్ఫెట్ కు భార్య ముగ్గురు సంతానం (ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు) ఉన్నారు.
The pirate has passed. RIP Jimmy Buffett. Tremendous influence on so many of us -T pic.twitter.com/HpyDWYWPfE
— Toby Keith (@tobykeith) September 2, 2023