చైతన్యను మ‌ర్చిపోవ‌డానికి నిహారిక ఏం చేసిందో చూశారా.. చివ‌ర‌కు దాన్ని కూడా వ‌దిలేసింది!

మెగా డాట‌ర్ నిహారిక ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఏం జ‌రిగిందో తెలిసిందే. 2020 డిసెంబర్ 9న వెంకట చైతన్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను నిహారిక వివాహం చేసుకుంది. వీరిది పెద్ద‌లు కుదుర్చిన పెళ్లి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో వీరి పెళ్లి అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. ఈ వివాహ వేడుకలో మెగా, అల్లు, జొన్న‌ల‌గ‌డ్డ‌ ఫ్యామిలీలతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంద‌డి చేశారు.

అప్ప‌ట్లో నిహారిక పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మెగా ఫ్యామిలీలోనే చూడచక్కనైన జంట అని అంతా అన్నారు. కానీ, వీరి బంధం ఎక్కువ కాలం కొన‌సాగ‌లేదు. పెళ్లై మూడేళ్లు గ‌డ‌వ‌క ముందే నిహారిక, చైత‌న్య విడాకులు తీసుకున్నారు. మే నెల‌లో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే చైత‌న్య‌తో విడిపోయిన త‌ర్వాత నిహారిక కెరీర్ పై ఫోక‌స్ పెట్టింది. న‌టిగా, నిర్మాత‌గా బిజీ అవుతోంది.

చైత‌న్య‌ను మ‌ర్చిపోవ‌డానికి ఏం చేయాలో అన్నీ చేస్తోంది. త‌ర‌చూ ఫ్రెండ్స్ తో వెకేష‌న్స్ కు వెళ్తుంది. అలాగే నిహారిక‌కు పెట్స్ అంటే ఇష్ట‌మ‌ని.. క‌లిసి ఉన్న‌ప్పుడు చైత‌న్య ఓ పెట్‌ను గిఫ్ట్ గా ఇచ్చాడు. దాని పేరు బజ్ అని కూడా పెట్టుకుంది నిహారిక. అయితే విడాకుల త‌ర్వాత నిహారిక బ‌జ్ ను త‌న‌తోనే తీసుకెళ్లిపోయింద‌ని అంతా అనుకున్నారు. కానీ, బ‌జ్ చైత‌న్య వ‌ద్దే ఉన్నాడు. తాజాగా చైతన్య బ‌జ్ ఫోటోను పంచుకున్నాడు. దీంతో చైతన్యను మ‌ర్చిపోవ‌డానికి నిహారిక చివ‌ర‌కు త‌న‌కెంతో ఇష్ట‌మైన బ‌జ్ ను కూడా వ‌దిలేసిందా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Chaitanya Jv (@chaitanya_jv)